swami kamalananda bharati slams AP Govt వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ కమలానంద భారతి

Swami kamalananda bharati sensational comments on ap government

Kamalananda Bharati Sensational Comments On AP Government, swami kamalananda bharati slams YS Government, Kamalananda Bharati, Swami Kamalananda Bharati, YS JaganMohan Reddy, AP Government, Hindu Devalaya prathistan, Andhra Pradesh, Politics

Hindu Devalaya prathistan peet president Swami Kamalananda Bharati Sensational Comments On Andhra Pradesh Government

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ స్వామి కమలానంద భారతి

Posted: 09/07/2019 08:59 PM IST
Swami kamalananda bharati sensational comments on ap government

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి స్వామి కమలానంద భారతి మండిపడ్డారు. వైఎస్ జగణ్ ప్రభుత్వం రెండు మతాల వారికి అధిక ప్రాధాన్యత కల్పించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రెండు మతాలను తృప్తి పరిచేలా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

పాస్టర్లకు, మసీదుల్లో పని చేసేవారికి జీతాలు ఇవ్వాలనుకున్నప్పుడు... దేవాదాయశాఖ మాదిరి ఓ శాఖను ఏర్పాటు చేసి, దాని ద్వారా జీతాలు ఇవ్వాలని సూచించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్రైస్తవ మతాన్ని పరిచయం చేసే కుట్ర దాగుందని చెప్పారు. హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు పని చేయడం సరికాదని కమలానంద భారతి చెప్పారు. అన్యమతస్థులను వెంటనే గుర్తించి, వారిని తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంలో ఇతర మతస్థులు కోర్టుకు వెళ్లినా చెల్లదని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులను పెంచడం కూడా అనవసరమని... ఖర్చులు పెరగడం మినహా మరే ప్రయోజనం లేదని అన్నారు. రాజకీయ నిరుద్యోగాన్ని తొలగించడానికే టీటీడీ సభ్యుల సంఖ్యను పెంచుతున్నారని మండిపడ్డారు. ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు తీసుకునేవారికి ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉండాలని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles