Communications from lander 'Vikram' lost: ISRO చంద్రయాన్ 2: విక్రమ్ నుంచి నిలిచిన సంకేతాలు

Communication link lost with moon lander vikram isro

Chandrayaan-2, Vikram lander, Isro, ground station, landing, india, america, russia, china, oreign affairs, politics

In a huge disappointment, communications from Chandrayaan-2’s Vikram lander to ISRO’s ground station was lost before touchdown while the nation eagerly awaited its soft landing on the hitherto unexplored lunar south pole in the early hours.

చంద్రయాన్ 2: విక్రమ్ నుంచి నిలిచిన సంకేతాలు

Posted: 09/07/2019 10:02 AM IST
Communication link lost with moon lander vikram isro

ప్రపంచ దేశాలతో పాటు దేశప్రజలు ఎంతోఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-2 చంద్రుడిపై అడుగుపెట్టే చివరి క్షణంలో అవాంతరాలు ఏర్పడ్డాయి. చంద్రడిపై ల్యాండ్ అయ్యే క్రమంలో ల్యాండర్ విక్రమ్ నుంచి చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చంద్రుడిపై కాలు మోపడమే తరువాయి అన్న తరుణంలో విక్రమ్ నుంచి సమాచార సంకేతాలు నిలిచిపోయాయి. ఫలితంగా విక్రమ్ సేఫ్ ల్యాండ అయ్యిందా.? లేదా.? అన్న వివరాలు తెలియాల్సి వుంది.

మరో నిమిషంలో చంద్రుడిపై దిగుతుందనగా అకస్మాత్తుగా సిగ్నల్స్ ఆగిపోవడంతో శాస్త్రవేత్తలు నిరాశలో మునిగిపోయారు. చివరి 15 నిమిషాల్లో 14 నిమిషాలు విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే, ‘విక్రమ్’ మరో నిమిషంలో జాబిల్లిని ముద్దాడుతుందనగా సంకేతాలు ఆగిపోయాయి. అర్ధరాత్రి దాటాక 1:38 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలైంది. చంద్రుడి ఉపరితలం వైపు గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన విక్రమ్‌ను అదుపు చేయడం ఇస్రోకు కష్టంగా మారినట్లు తెలుస్తోంది.

విక్రమ్ వేగానికి కళ్లెం వేసేందుకు సైంటిస్టులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ల్యాండర్ నాలుగు మూలలతో పాటు మధ్య భాగంలో థ్రస్టర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు థ్రస్టర్స్‌ని వ్యతిరేక దిశలో ప్రయోగించి దాని వేగాన్ని తగ్గించారు. మొదట రఫ్ బ్రేకింగ్ అంచెను విజయవంతంగా పూర్తిచేశాక.. ఫైన్ బ్రేకింగ్ ప్రారంభమైంది. అప్పుడు ప్రణాళిక ప్రకారమే వ్యోమనౌక వేగం తగ్గుతూ వచ్చింది. కానీ ఆఖరి క్షణాల్లో అనూహ్యంగా విక్రమ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. మరో నిమిషంలో చంద్రుడిపై దిగాల్సిన సమయంలో ఈ అవరోధం ఏర్పడింది.

జాబిల్లికి విక్రమ్ ల్యాండర్‌కు మధ్య గల దూరం 2.1 కిలోమీటర్లు ఉందనగా సమస్య మొదలైంది. ‘విక్రమ్’ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. దీంతో బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్‌ట్రాక్)లో ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంది. సంకేతాల కోసం కాసేపు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయని, సంబంధిత డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ కె.శివన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకు ఎన్నో దేశాలు మృదువుగా చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే విజయవంతమయ్యాయి. అగ్రరాజ్యం కూడా పది పర్యాయాలు విఫలమైన తరువాత పదకొండవ సారి విజయం సాధించింది. సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేట్ 37శాతమే అని తెలిసినప్పటికీ.. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చంద్రయాన్-2 ప్రయోగం చేసింది ఇస్రో. అనుకున్నట్లుగానే చందమామ దిశగా 48 రోజులు సజావుగా ప్రయాణించి...గమ్యానికి చేరువలో గతి తప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrayaan-2  Vikram lander  Isro  ground station  landing  foreign affairs  politics  

Other Articles