India is proud of its scientists: PM Modi చంద్రయాన్-2: ఇస్రో చైర్మన్ కంటతడి.. ఓదార్చిన ప్రధాని

Communication link lost with moon lander vikram isro

PM Modi consoles isro chairman, ISRO chairman Shivan broke-out, PM Modi urges nation to back ISRO, Chandrayaan-2, PM Modi, Shivan, ISRO Chairman, Vikram lander, ground station, landing, foreign affairs, politics

In a huge disappointment, communications from Chandrayaan-2’s Vikram lander to ISRO’s ground station was lost before touchdown while the nation eagerly awaited its soft landing on the hitherto unexplored lunar south pole in the early hours.

ITEMVIDEOS: చంద్రయాన్-2: ఇస్రో చైర్మన్ కంటతడి.. ఓదార్చిన ప్రధాని

Posted: 09/07/2019 11:16 AM IST
Communication link lost with moon lander vikram isro

దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-2 చంద్రుడిపై అడుగుపెట్టే చివరి క్షణంలో అవాంతరాలు ఎదురుకావడంతో విఫలం కావడంతో ఇస్రో చైర్మన్ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఎంతో ఉత్సాహంలో ఆనందక్షణాల కోసం హర్షాతిరేకాల కోసం వేచి చూస్తున్న చివరి క్షణంలో చంద్రాయన్-2 ల్యాండర్ విక్రమ్ నుంచి ఇస్రోకు సమాచార అనుసంధాలు తెగిపోవడంతో ఫెయిల్ అయ్యింది. దీంతో ఇస్రో చైర్మన్ కంటతడి పెట్టారు. ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలంతా తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.

కాగా, సైంటిస్టుల ఆవేనదంతా వారి ముఖంలోనే కనిపిస్తుందని మోదీ కూడా తెలిపారు. శాస్త్రవేత్తల ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ఆయన... వారి శ్రమను దేశ ప్రజలు అర్థం చేసుకోగలరని అన్నారు. దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఇవాళ ఉదయం 8 గంటలకు ఆయన ప్రసంగించారు. చంద్రయాన్ 2 కోసం పనిచేసిన వారందరిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మీ ప్రయోగాలు ఇక్కడితో ఆగిపోకూడదని.. మీ సంకల్పం మరింత బలపడాలని శాస్త్రవేత్తలకు ప్రధాని పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో ఎవరైనా చంద్రయాన్ గురించి రాస్తే... ఫెయిలైందని రాయరన్న మోదీ... చివరి క్షణం వరకూ చందమామను చేరుకోవడానికి ప్రయత్నించారనే రాస్తారని అన్నారు. అంతరిక్ష ప్రయోగాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయన్న మోదీ... వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మరిన్ని లక్ష్యాల్ని సాధించాల్సి ఉందన్నారు. శాస్త్రవేత్తలు సంతోషించే మరిన్ని విజయాలు భవిష్యత్తులో వస్తాయన్న మోదీ... నెక్ట్స్ టైమ్ మరింత ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు.

ఇస్రో శాస్త్రవేత్తల్ని చూసి దేశం గర్విస్తోందన్న మోదీ... ఇప్పటివరకూ జరిగిన జర్నీ ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. చంద్రమండల యాత్ర కొనసాగుతుందన్న ఆయన.. మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తును చూస్తామన్నారు. ఇప్పటివరకూ ఇస్రో సాధించిన విజయాల్ని గుర్తుచేసిన మోదీ... మరిన్ని ప్రయోగాలు చెయ్యాలనీ, తాను, దేశం మొత్తం ఇస్రో శాస్త్రవేత్తల వెంట ఉంటుందని ధైర్యం చెప్పారు.

అయితే ప్రసంగం అనంతరం వెళ్తున్న మోదీని ఇస్రో శాస్త్రవేత్తలు, ఛైర్మన్ అంతా కలిశారు. ఈ నేపథ్యంలో మోదీ దగ్గరకు వెళ్లిన ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టుకున్నారు. దీంతో మోదీ అతడ్ని దగ్గరకు తీసుకున్నారు. గుండెలకు హత్తుకొని ధైర్యం చెప్పారు. భుజంపై శివన్‌ తల ఉంచి.. ఆయన వీపును నిమురుతూ... భరోసా ఇచ్చారు. ఇలాంటి అవాంతరాలు సహజమని.. అయితే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrayaan-2  PM Modi  Shivan  ISRO Chairman  Vikram lander  ground station  landing  foreign affairs  politics  

Other Articles