స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమయ్యే ‘నామ్ కరణ్’ షోతో పాప్యులర్ అయిన బుల్లితెర నటి నళిని నేగిపై దాడి జరిగింది. స్నేహితురాలే కదా.. అనుకుని సాయం చేద్దామనుకున్న ఆమె మంచి మనసును ఆమె స్నేహితురాలే గాయపర్చింది. బౌతికింగానే కాకుండా తన స్నేహితురాలు చేసిన మానసిక గాయం పట్లు నళిని మళ్లీ మళ్లీ తలుచుకుని బాధపడుతొంది. రూమ్మేట్ ప్రీతి రాణా, తల్లి స్నేహలత రాణాతో కలిసి తనపై దాడి చేసిన ఘటనపై అమె పోలీసులను ఆశ్రయించి వారిపై పిర్యాదు చేసింది. నళిని ఇచ్చిన కంప్లేంట్ ఆధారంగా పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఓషివారా పోలీసుల కథనం ప్రకారం.. కొన్నేళ్లుగా నళిని, ప్రీతి కలిసి ఉంటున్నారు. ఆ తర్వాత నళిని మరో ఫ్లాట్ కు మారింది. ఇటీవల నళినిని కలిసిన ప్రీతి.. తనకు ఫ్లాట్ దొరకడం లేదని, దొరికేంత వరకు కొన్ని వారాల పాటు తాను కూడా కలిసి ఉంటానని అభ్యర్థించింది. సర్లే స్నేహితురాలే కదా.. అని ప్రీతి వినతిని నళిని అంగీకరించింది. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రీతి తల్లి స్నేహలత కూడా నళిని ఫ్లాట్ కు వచ్చి అక్కడే తిష్ట వేసింది. అంతేకాదు.. తన కూతురితో పాటు అమెను కూడా ఇంట్లో అప్పన్నంగా ఉంచనిచ్చినందుకు ఎంతో కృతజ్ఞతగా వుండాల్సిన స్నేహలత.. నళిని పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ.. అమెను అకారణంగా దూషిస్తూ వచ్చింది.
తొలుత పోనిలే పెద్దావిడ అని ఊరుకుంటే రానురాను ఇది మరీ ఎక్కువైంది. దీంతో వారిని తన ఫ్లాట్ ఖాళీ చేయాల్సిందింగా కోరింది. గతవారం నళినితో స్నేహలత అకారణంగా వాదనకు దిగింది. అక్కడితో ఆగక కుమార్తె ప్రీతితో నళినిపై లేనిపోనివి చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి నళినిని అసభ్యంగా తిడుతూ దాడి చేశారు. స్నేహలత గ్లాసుతో నళిని ముఖంపై దాడిచేసింది. ఇద్దరూ కలిసి తనను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నళిని పేర్కొంది. తాను నటిని కావడంతో తన ముఖాన్ని ఛిద్రం చేయాలని భావించారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ విషయం వెలుగులోకి రావడం.. రూమ్ మేట్ అమె తల్లి దాడితో కమిళిపోయిన నళిని ముఖానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Feb 24 | పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అంటూ ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా.. ఆశ అన్నది అత్యాశగా మారిన మనిషి మోసపోక తప్పదు.. కొత్త కో్త పథకాలతో మోసం చేసేవాళ్లకు... Read more
Feb 24 | పుదుచ్చేరిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా వున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో అక్కడ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవడంలో విఫలం కావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై... Read more
Feb 24 | కోర్టుల్లో న్యాయమూర్తులను ‘యువరానర్’ అని సంబోధించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ న్యాయస్థానంలో ఈ పదాన్ని ఉచ్చరించాలో కూడా తెలియకపోవడం.. ఓ న్యాయవిద్యార్థిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభ్యంతరం వ్యక్తం... Read more
Feb 24 | మనిషి తన మేధోశక్తితో చంద్రయానం, మంగళయానంతో పాటు అంగారక గ్రహాన్వేషణ చేస్తూ.. పరగ్రహాలపై కూడా కాలుమోపి వస్తున్న తరుణంలోనూ మూఢాంధకారాలు, మూఢాచారాలు, మూడవిశ్వాసాలను మాత్రం వదలుకోవడం లేదు. దేశానికి స్వతంత్రం లభించిన 70 ఏళ్లు... Read more
Feb 24 | కరోనా టీకా ‘కొరోనిల్’ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రముఖ యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ ను అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే దేశం నలువైపుల నుంచి డిమాండ్లు పెల్లుబిక్కుతున్న తరుణంలో ఆయన... Read more