Pawan Kalyan Desires Unexpected Gift From His Fan జనసేనానికి అభిమాని ప్రత్యేక కానుక

Pawan kalyan gets a special gift from fans ahead of his birthday

Janasena, Pawan Kalyan, Mangalagiri, farmers, Amaravati, capital issue, fan, handmade chappal, Trivikram Srinivas, trailer, Sye Raa Narasimha Reddy, Sye Raa, politics, Pawan Kalyan, Largo Winch, handmade chappal, birthday, Agnyaathavaasi, andhra pradesh, politics

Jana Sena party President Pawan Kalyan is going to celebrate his birthday on September 2 and a fan from Mangalagiri in AP presented him with a pair of handmade chappal. Powerstar accepted the gift from his fan, leaving a smile on his face.

ITEMVIDEOS: అభిమాని నుంచి ప్రత్యేక కానుక అందుకున్న పవన్ కల్యాణ్

Posted: 08/31/2019 03:37 PM IST
Pawan kalyan gets a special gift from fans ahead of his birthday

ఆంధ్రరాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుందా.? లేదా.? రాష్ట్రం ప్రజలంతా ఇప్పుడు ఇదే విషయమై చర్చిస్తున్నారు. రైళ్లలో వెళ్తున్నా బస్సుల్లో వెళ్తున్నా.. గ్రామాల్లో కూడళ్ల వద్ద కలసినా..లేక పట్టణాల్లో కూడళ్ల వద్ద ఎదురైనా.. అందరిముందన్న ఒకే అంశం ఇది. అమరావతి కాకపోతే రాజధానిగా ఏ ప్రాంతం తయారుకానుందన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అక్కడే నిర్మిస్తారా లేదంటే ఎక్కడికో తీసుకెళతారా... అసలు రాజకీయ నాయకులు ఎందుకిలా మాట్లాడుతున్నారు... మంత్రులు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు రాజధానిపై చెప్పేస్తున్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడరేంటి? నిజంగా అమరావతి అంతే సంగతులా? అమరావతి అదిగో అంటూ చంద్రబాబు చందమామలా చూపించిన రాజధాని నగరం కలలో స్వప్నంగానే మారనుందా.? లేక ఇలలో సాక్ష్యాత్కరిస్తోందా.? ఇలాంటి అనేక సందేహాలు రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి కోసం భూములను ఇచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని రాజకీయ పక్షాలను కలసి తమ బాధను చెప్పుకున్నారు. అలాగే హైదరాబాద్ వెళ్లి జనసేనాని పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. అయితే అందరి నాయకుల్లా చూస్తామని మాట ఇవ్వకుండా తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తానని రంగంలోకి దిగాడు పవన్ కల్యాణ్.

అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతుల వేదన కోసం ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు. క్రితం రోజు ఆయన మంగళగిరిలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ వైపుకు ఆవేశంగా పరుగులు తీస్తూ వచ్చాడు. అతడెందుకు అలా వచ్చాడా అని చూసేలోపు సంచీలోనుంచి కొత్త చెప్పుల జత తీసి... అన్నా, పవనన్నా... నీకోసం కొత్త చెప్పులు తెచ్చానన్నా అంటూ పవన్ చేతుల్లో పెట్టాడు. ఇవి తాను పవన్ కల్యాణ్ కోసం తన స్వహస్తాలతో తయారు చేశానని ఆ యువకుడు జనసేనానికి అందించాడు. నవ్వుతూ వాటిని తీసుకున్న పవన్ కల్యాణ్.. వాటిని ధరించే అమరావతిలో పర్యటించడం గమనార్హం. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవు మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  Mangalagiri  farmers  Amaravati  capital issue  fan  handmade chappal  andhra pradesh  politics  

Other Articles