IT Slab May Change as per Govt Panel proposals ఆ సిఫార్సులు అమల్లోకి వస్తే పన్నుచెల్లింపుదారులకు ఊరట..

Income tax slab may change as per govt panel recommendations

Incoem tax, income tax slab, tax revenue, taxpayers, Direct Tax Code, CBDT, I-T dept, Income Tax, Nirmala Sitharaman, Nation, Politics

In another step in favour of the middle-class, the Modi government has constituted a proposal recommending a new tax regime. A high-level tax force was set up by the Centre that reduced the tax slab to 10 per cent for people earning between Rs 5 lakh and 10 lakh.

ఆ సిఫార్సులు అమల్లోకి వస్తే పన్నుచెల్లింపుదారులకు ఊరట..

Posted: 08/29/2019 12:37 PM IST
Income tax slab may change as per govt panel recommendations

ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాం.. సగటున భారతీయుల ఆదాయం కూడా పెరుగుతుందని చెబుతున్న ప్రభుత్వాలు.. వాటికి అనుగూణంగా పెరుగుతున్న ధరాఘాతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని.. ఓ వైపు ధరల పోటు మరో వైపు పన్నుఫోటుతో సగటు భారతీయుడు తమ కుటుంబాలను పోషించలేక చిక్కిశల్యమవుతున్నాడన్నది కాదనలేని వాస్తవం. రెండున్నర లక్షల వరకు వార్షికాదాయం వున్నవారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించిన కేంద్రం.. ఈ పరిధిని పెంచుతారని గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

అయితే మారుతున్న కాలానికి అనుగూణంగా ఆదాయపన్నును కూడా మార్చాలని యోచిస్తున్న ప్రభుత్వం అందుకుగాను అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆదాయపన్ను చెల్లింపులు ఎలా వుండాలన్న విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతరామన్ కు ప్రతిపాదనలను అందించింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే మాత్రం ఐదు నుంచి పది లక్షల మధ్య వార్షికాదాయం లభించే వారికి కాసింత ఊరట లభించనుంది. వీరు ఏడాదికి కేవలం 10 శాతం ఆదాయపు పన్ను చెల్లించాల్సి రావొచ్చు. కమిటీ అలాగే వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబ్స్‌లోనూ మార్పులు సూచించింది. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఆదాయం ఉన్న వారిపై ట్యాక్స్‌ 20 శాతానికి తగ్గించాలని పేర్కొంది.

ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ ఆదాయం ఉన్న వారిపై 5 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఆదాయం ఉన్న వారిపై 20 శాతం, రూ.10 లక్షలు పైన ఆదాయం ఉన్న వారిపై 30 శాతం పన్ను ఉంది. ప్రస్తుత పన్ను శ్లాబ్స్‌కు ప్రత్యామ్నాయంగా 5 శాతం, 10 శాతం, 20 శాతం, 30 శాతం, 35 శాతం పన్ను శ్లాబ్స్‌ను కమిటీ సూచించింది. ఇకపోతే ఇప్పుడు కూడా రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లించిన పన్ను రిబేట్ రూపంలో మళ్లీ వెనక్కు పొందొచ్చు. 2019 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే అంశాన్ని వెల్లడించారు.

58 ఏళ్ల నాటి ఇన్‌కమ్ ట్యాక్స్‌ చట్టాల దుమ్ముదులిపేందుకు కేంద్రం సన్నధమైంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం టస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ఆగస్ట్ 19న తన నివేదికను నిర్మలా సీతారామన్‌కు అందజేసింది. అయితే ఈ నివేదికలోని అంశాలను ప్రభుత్వం ఇంకా బయటకు వెల్లడించలేదు. రూ.20 లక్షలు నుంచి రూ.2 కోట్ల వరకు ఆదాయం ఉన్న వారిపై 30 శాతం పన్ను విధించాలని టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది. అలాగే సూపర్ రిచ్ (రూ.2 కోట్ల పైన ఆదాయం) కేటరిగిపై 35 శాతం పన్నును రికమెండ్ చేసింది. ఇక సర్ చార్జీలు తొలగించాలని సూచించింది.

హైలెవల్ కమిటీ పన్ను సిఫార్సులు ఇలా..

రూ.2.5 లక్షల వరకు     ఎలాంటి పన్ను లేదు
రూ.5 లక్షల వరకు  రిబేట్ ప్రయోజనం
రూ.2.5 లక్షలు-రూ.10 లక్షలు     10 శాతం పన్ను
రూ.10 లక్షలు-రూ.20 లక్షలు     20 శాతం పన్ను
రూ.20 లక్షలు- రూ.2 కోట్లు     30 శాతం పన్ను
రూ.2 కోట్లు- ఆపైన     35 శాతం పన్ను

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBDT  I-T dept  Income Tax  Nirmala Sitharaman  Direct Tax Code  Nation  Politics  

Other Articles