Kolkata BPO cheating youth; 3 Bengalis arrested మాయలాడి: యువకులకు వల.. ఆపై బ్లాక్ మెయిల్..

Soma sarkar the lady leading the cheating bpo team

running dating call center, Four persons arrested, call center case, call center, soma sarkar, Arnabsur, Mohammed Imran, dating site, tele-caller girls, saha enterprises, Ho-Chi-Minh Sarani, kolkata, west bengal, Cyber Crime, crime

Four persons were arrested by the officials of Central Crime Station (CCS), Hyderabad, by conducting a raid on a call center in Kolkata, from where they were duping several persons by claiming that they are operating online dating portal.

మాయలాడి: యువకులకు వల.. ఆపై బ్లాక్ మెయిల్..

Posted: 08/27/2019 05:02 PM IST
Soma sarkar the lady leading the cheating bpo team

తమ మానాన తాము పనులు చేసుకుపోతున్న యువకులపై కన్నెపిల్లలతో ముచ్చట్లు.. డేటింగ్, దీంతో పాటు ఇంకా ఎన్నె ఎన్నోన్నో అంటూ స్మార్ట్ ఫోన్లకు సందేశాలు, ఈమెయిల్ అకౌంట్లకు మెయిల్ సందేశాలు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలుగా ప్రచారం చేయవచ్చో అన్ని మార్గాల్లో దేశవ్యాప్తంగా ప్రచారం చేసి.. వల విసురుతారు. నెలకు కేవలం రూ. 1,025 మాత్రమే. వారితో కావాలంటే మాట్లాడండి. వారు ఇష్టపడితే డేటింగ్ కు వెళ్లండి. ఎంత కాలానికైనా ప్యాకేజీలున్నాయి.. అంటూ మాయమాటలతో యువతపై మాటువేసిన మాయలాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోల్ కతా కేంద్రంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సోమా సర్కార్ ముఠాకు సంబంధించి..పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.. సోమా సర్కార్ అనే మాయలాడి పశ్చిమ బెంగాల్ కు చెందిన అంబాసుర్, ఇమ్రాన్ లను కలుపుకుని దేశవ్యాప్తంగా అమ్మాయిలు అంటే వీక్ నెస్ వున్న యువకులను టార్గెట్ గా చేసుకుని వారిని నిట్టనిలువునా ముంచేందుకు పథకాన్ని రచించింది. అందుకు ఆమె చేసిందల్లా 'లవ్‌ ఆర్ట్‌ డేటింగ్‌' పేరిట వెబ్‌ సైట్‌ తెరవడమే. ఈ వైబ్ సైట్ ముసుగులో రెండేళ్ల నుంచి యువకుల నుంచి అప్పనంగా డబ్బును లాగేస్తోంది.

అదెలా అంటే.. ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి, 20 మంది అమ్మాయిలను నియమించుకుని, వారితో దందా సాగించింది. రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ. 1,025, ఆపై ప్యాకేజీల ఆధారంగా రూ. 18,000 వరకూ తీసుకుంది. కేవలం మాటలతో సరిపెట్టుకుంటామంటే, ఓ అమ్మాయి రోజుకు గంట పాటు కబుర్లు చెబుతుంది. ఇక డేటింగ్ కావాలంటే, మరింత డబ్బు తీసుకుని అమ్మాయిల ఫోటోలు, వివరాలు అంటూ చూపిస్తారు. ఆపై సోమా కాల్‌ సెంటర్‌ లో పనిచేసే అమ్మాయిలే, అబ్బాయిలతో మాట్లాడుతూ ఉండేవారు. డేటింగ్ చేద్దామని ఆశపడే అబ్బాయిలే వీరి టార్గెట్.

వారి ఫోటోలు, అడ్రస్, ఫోన్ నంబర్లు సేకరించే ఈ టీమ్, ఇతర డేటింగ్ సైట్లలో వాటిని ఉంచి పరువు తీసేది. ఆపై బ్లాక్ మెయిల్ కు దిగుతారు. మీ ఫొటోలు ఫలానా వెబ్‌ సైట్ లో ఉన్నాయని, అనైతిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నందున కోల్‌ కతాలో కేసు నమోదైందని బెదిరిస్తారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకు డబ్బు కట్టాలని చెప్పి, వారి నుంచి డబ్బు వసూలు చేస్తారు. ఇలా ఎంతో మందిని నమ్మించి దాదాపు రూ. 8 కోట్లు వసూలు చేశారు. వీరి చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో, కేసును నమోదు చేసి విచారించిన స్పెషల్ టీమ్, కోల్‌ కతాకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని, వారిని హైదరాబాద్ కు తరలించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles