రిజర్వ్ బ్యాంకు 1. 76 లక్షల కోట్ల మిగులు నిధులను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి బదలాయించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. దాదాపు ఇన్ని నిధులు 2019 బడ్జెట్ ఎనౌన్స్ మెంట్ నుంచి ' మిస్ ' అయ్యాయని కాంగ్రెస్ తన ట్విట్టర్లో పేర్కొంది. ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారు ? బడ్జెట్ ప్రకటనలో నుంచి అవి ఎందుకు కనబడకుండా పోయాయి అని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. బడ్జెట్ కేటాయింపుల నుంచి అదృశ్యమైన నిధులు పక్కదారిలో ఆర్బీఐ నుంచి తిరిగి కేంద్రం అందుకుందని విమర్శించింది.
ఇలా రిజర్వ్ బ్యాంకును దోపిడీ చేయడం మన ఆర్ధిక వ్యవస్థకు మరింత చేటు తెస్తుందని, ఆర్బీఐ క్రెడిట్ రేటింగును తగ్గిస్తుందని విమర్శించింది. ఆర్బీఐ నుంచి ' దొంగిలించిన సొమ్ము' దేశ ఆర్ధిక వ్యవస్థకు సహాయపడదని ఈ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది బ్యాంకును లూటీ చేయడమే అన్నారు. తాము స్వయంగా సృష్టించిన ఆర్ధిక సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ప్రధాని మోదీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలియదని రాహుల్ తన ట్విట్టర్లో ఆరోపించారు. రిజర్వ్ బ్యాంకు నుంచి దొంగతనం చేయడం ఫలితమివ్వదని, ఇది డిస్పెన్సరీ నుంచి బ్యాండ్ ఎయిడ్ ను చోరీ చేసి తుపాకీ గాయమైన చోట అంటించడమే అవుతుందని ఆయన అన్నారు.
PM & FM are clueless about how to solve their self created economic disaster.
— Rahul Gandhi (@RahulGandhi) August 27, 2019
Stealing from RBI won’t work - it’s like stealing a Band-Aid from the dispensary & sticking it on a gunshot wound. #RBILooted https://t.co/P7vEzWvTY3
కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా దాదాపు ఇలాగే ట్వీట్ చేశారు. బడ్జెట్ లెక్కల్లో మిస్ అయిన సొమ్మును ఈ 1. 76 లక్షల కోట్లతో భర్తీ చేస్తారా ? ఇది కాకతాళీయమా అని ఆయన ప్రశ్నించారు. పైగా ఇది ఆర్ధిక దోపిడీయా లేక గారడీయా ? మీ పార్టీ (బీజేపీ) ఫ్రెండ్స్ ని ఆదుకోవడానికి ఈ సొమ్మును వినియోగిస్తారా అని కూడా ప్రశ్నించారు. ఆర్బీఐ నుంచి భారీ సొమ్మును తీసుకోవడం ఆర్ధిక పరిస్థితిని మరింత దెబ్బ తీస్తుందని, యుధ్ధం వంటి పరిస్థితులను సృష్టిస్తుందని సుర్జేవాలా పేర్కొన్నారు. ' మోదీ 2. 0 ప్రభుత్వం ; ఆర్ ' అన్న అక్షరాన్ని రిజర్వ్ (బ్యాంకు) నుంచి మరో ' ఆర్ ' (రావెజ్డ్) అంటే ' వినాశనం ' అన్న అక్షరంగా మార్చినట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. రిజర్వ్ బ్యాంక్ విశ్వసనీయతను బీజేపీ దెబ్బ తీస్తోందని అన్నారు.
కాగా, రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులు బదిలీ చేసేందుకు ఆర్బీఐ సమ్మతి తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన బోర్డు సమావేశంలో నిధుల బదిలీకి ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో, త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,76,051 కోట్లు బదిలీ కానున్నాయి. నిధుల బదిలీ ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ... గత ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ నిధుల బదలాయింపుకు ఒప్పుకోలేదు. దీంతో, ఆయనను రాజీనామా చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Rs. 1.76 lakh cr given to the govt by RBI is almost the exact same amount missing from Budget 2019 announcement.
— Congress (@INCIndia) August 27, 2019
Where was that money spent? Why was it missing from the Budget?
Looting the RBI like this only devastates our economy further & reduces credit rating of the bank. pic.twitter.com/wZQ6dqYtdi
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more