IITian joins Indian Railway as trackman ఉద్యోగ భద్రతే ముఖ్యం.. ట్రాక్ మెన్ గా ఐఐటీ విద్యార్థి

Bombay iitian takes up rrb group d job of a trackman for job safety

RRB group d, IITian join group d job, IITian becomes trackman, Bombay IITian of Bihar joins railway job, Bombay IITian RRB group d, IITian join railways group d job, IITian becomes trackman, iit bombay, iitian, rrb group d, trackman, Railways, job safety, Shrawan kumar, Trank maintainer, dhanbad, Bihar

In a bizarre and even alarming case, a post-graduate engineer from IIT Bombay, has taken up the RRB Group D job, as a trackman for job-safety. Shrawan Kumar, the B.Tech, M.Tech graduate who starts work as Trank Maintainer at Dhanbad.

నిరుద్యోగ భారతం: ఉద్యోగ భద్రతే ముఖ్యం.. ట్రాక్ మెన్ గా ఐఐటీ విద్యార్థి

Posted: 08/27/2019 01:44 PM IST
Bombay iitian takes up rrb group d job of a trackman for job safety

భారత్ అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా పయనిస్తోందని ప్రభుత్వాలు, ప్రభుత్వాధి నేతలు చెబుతున్నా.. వాటి ఫలాలు భారతీయులందరికీ అందడం లేదన్నది వాస్తవం. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ అన్నమో రామచంద్ర అనే ఆర్థనాధాలు వినిపిస్తూనే వున్నాయి. కోటి విద్యలు కూటి కోరకే అన్న చందాన.. ఎంత చదివినా.. భద్రత లేని ఉద్యోగాలలో చేరి జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇష్టం లేని యువత సంఖ్య కూడా పెరుగుతూనే వుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగాలతో ఎంతకాలం అంటూ యాజమాన్యాల వేధింపులను మౌనంగా భరించాలని అనుకున్నాడో ఏమో..ఓ ఐఐటీ విద్యార్థి ఏకంగా రైల్వేస్ లోని గ్రూప్ డి జాబ్ రాసి.. తాజాగా ఆ జాబ్ లో చేరాడు.

అది కూడా తక్కువ స్థాయి విభాగంలో చేరాడు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబేలో చదివి ఇప్పుడు రైల్వేలో ట్రాక్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పట్నాకు చెందిన శ్రవణ్‌ కుమార్‌ 2010లో ఐఐటీ బాంబేలో చేరాడు. బీటెక్‌, ఎంటెక్‌ పట్టా పొందాడు. ప్రభుత్వ ఉద్యోగి కావాలన్నది అతడి టార్గెట్. చదువు పూర్తవగానే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. తనతో పాటు చదువుకున్న ఐఐటీ స్నేహితులు పేరున్న కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. శ్రవణ్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగాడు.

ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన గ్రూప్‌ డీ పరీక్షలో శ్రవణ్ పాస్ అయ్యాడు. ట్రాక్ మెయింటెనర్‌(ట్రాక్‌మన్‌)గా ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం ధన్‌బాద్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోని చంద్రపురాలో విధులు నిర్వహిస్తున్నాడు. మల్టీ నేషనల్ కంపెనీలో కొలువు, లక్షల్లో జీతం, విలాసవంతమైన సౌకర్యాలు.. ఇవన్నీ కాదని.. ఇలాంటి జాబ్ ఎందుకు ఎంచుకున్నావు అని అడిగితే.. ఉద్యోగ భద్రత ఉంటుందనే కారణంతోనే తాను రైల్వేల్లో చేరినట్లు శ్రవణ్‌ చెబుతున్నాడు. జాబ్ చిన్నదా పెద్దదా.. జీతం తక్కువా ఎక్కువా.. అనే విషయాలు తాను పట్టించుకోను అన్నాడు. తనకు కావాల్సింది జాబ్ సెక్యూరిటీ, సంతృప్తి.

అందుకే తాను ప్రభుత్వం ఉద్యోగంలో చేరాను అని వివరించారు. ఎప్పటికైనా ప్రభుత్వ రంగంలో ఉన్నతస్థాయి అధికారి అవుతానని శ్రవణ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. శ్రవణ్ తీరు తెలిసి తోటి స్నేహితులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎవరి టేస్ట్ వారిది అని కామెంట్ చేస్తున్నారు. శ్రవణ్ గురించి తెలిసి అతడి స్నేహితులే కాదు.. నెటిజన్లు కూడా వండర్ అవుతున్నారు. సర్కారీ కొలువుకి ఎంత డిమాండ్ ఉందో చెప్పడానికి శ్రవణ్ ఉదంతమే నిదర్శనం అంటున్నారు. ఎంతైనా ప్రభుత్వం ఉద్యోగానికి మరే ఉద్యోగమూ సాటి రాదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : iit bombay  iitian  rrb group d  trackman  Railways  job safety  Shrawan kumar  Trank maintainer  dhanbad  Bihar  

Other Articles