MHA degrades Manmohan Singh's SPG security cover మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భద్రత కుదింపు

Manmohan singh s spg cover withdrawn z plus security remains

Manmohan Singh security, SPG withdrawn. Z plus security, CRPF cover, Ministry of Home Affairs, spg cover, special protection group, narendra modi, manmohan singh wife security, z+ security, indian prime minister, Amit Shah, former pm, politics

Ministry of Home Affairs (MHA) said that former Prime Minister Manmohan Singh continued to have Z plus security, The current security cover review is a periodical and professional exercise based on threat perception that is purely based on professional assessment by security agencies said MHA sources.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ..

Posted: 08/26/2019 12:06 PM IST
Manmohan singh s spg cover withdrawn z plus security remains

భారత మాజీ ప్రధాని మన్మోమన్ సింగ్‌ భద్రతను కేంద్రం హోం మంత్రిత్వశాఖ కుదించింది. ఇప్పటికే ఉన్న సెక్యూరిటీని తగ్గిస్తూ చాలామంది రాజకీయ నేతలకు షాకిచ్చిన కేంద్రం.. మాజీ ప్రధానికి ఉన్న సెక్యూరిటీని కూడా తగ్గించింది. మన్మోహన్ సింగ్ కు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది. మన్మోహన్ సింగ్ కు జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నామని చెప్పిన కేంద్రం.. ఆయనను సీఆర్ఫీఎఫ్ బలగాల భద్రత కిందకు తీసుకొచ్చింది.

దేశంలోని ప్రముఖుల భద్రతను సమీక్షించే విభాగం నివేదికల ఆధారంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రముఖుల జీవితాలకు ముప్పు ఎంత వరకు ఉందనే వార్షిక సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నమని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. మన్మోహన్ కు ఎస్పీజీ భద్రతను తొలగించినప్పటికీ... ఆయనకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగుతుందన్నారు. పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్... తన భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles