Amaravati farmers meet pawan kalyan అమరావతిలో పర్యటించనునున్న పవన్ కల్యాణ్.!

Amaravati farmers meet janasena chief pawan kalyan

pawan kalyan amaravati farmers meet, janasenani amaravati farmers meet, amaravati farmers raises issue with janasena chief, amaravati farners pawan kalyan, amaravati farmers janasena, pawan kalyan, janasena, janasena, Amaravati farmers, capital region, land pulling, Andhra Pradesh, Politics

The farmers of AP capital region Amaravati met JanaSena president, powerstar Pawan Kalyan today and have brought all the issues with which they have become disturbed. They wanted Jana Sena Chief Pawan Kalyan to lead their protest.

ITEMVIDEOS: రాజధాని రగడ: అమరావతిలో పర్యటించనునున్న పవన్ కల్యాణ్.!

Posted: 08/24/2019 04:33 PM IST
Amaravati farmers meet janasena chief pawan kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేనాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని పరిధిలో ఉన్న రైతులను ఆయన కలవనున్నారు. అమరావతిలో నిలిచిపోయిన రాజధాని పనులను పరిశీలించనున్నారు. రాష్ట్ర రాజధాని తరలింపుపై వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విస్మయానికి గురైన రైతులు ఆయనతో భేటీ అయిన తరువాత ఆయన తాను అమరావతిలో పర్యటించనున్నట్లు ప్రకటించారు.

క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని, అక్కడి రైతులను కలుస్తానని ఆయన వారికి చెప్పారు. అమరావతిలో పనులు ఎంతవరకు చేరకున్నాయి.. రాజధాని నిర్మాణం పనులు ఎందుకని నిలిచిపోయాయి అన్న విషయాలను వారితో కలసి చర్చించి తెలుసుకుంటానని అన్నారు. తమకు ఇవ్వాల్సిన కౌలు డబ్బును కూడా ప్రభుత్వం ఇవ్వలేదని ఈ సందర్భంగా పవన్ కు తెలిపారు. రాజధానిని మార్చబోతున్నారనే వార్తలతో తాము ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు. తమ సమస్యలపై పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న క్రమంలో రాజధాని మారుతూపోతే.. రాజధాని నిర్మాణం ఎప్పటికీ పూర్తికాదని అన్నారు. ఇక రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే 29 గ్రామాలు ఎప్పటికీ ముంపు గ్రామాలు కావని కూడా వారు తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ వేసిన కమిటీ సభ్యులే వచ్చి పరిశీలించి రాజధాని నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇక మూడు టీఎంసీల నీరు వచ్చినా వాటిని నదిలోకి తోడేందుకు రిజర్వాయర్లు వున్నాయని కూడా తెలిపారు. రైతుల అవేదనను విన్న పవన్ కల్యాన్.. తాను ఈ నెల 30, 31న అమరావతిలో పర్యటించి పరిశీలిస్తానని వారికి భరోసా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Amaravati farmers  capital region  land pulling  Andhra Pradesh  Politics  

Other Articles