Tributes pour in for arun jaitley అరుణ్ జైట్లీ మృతిపై తెలుగు ప్రముఖుల సంతాపం..

Tributes pour in for arun jaitley from telugu states

Venkaiah Naidu, KCR, TRS, YSRCP, YS Jagan, Chandrababu, TDP, Arun Jaitly Dead, Condolenses, Pawan Kalyan, BJP, Telangana, AP, Politics

Andhra Pradesh CM YS Jagan, Telangana CM KCR pay thier tributes to BJP Veteran Leader and former finance Minister Arun Jaitley who had his last breath today.

ITEMVIDEOS: అరుణ్ జైట్లీ మృతిపై ప్రముఖుల సంతాపం..

Posted: 08/24/2019 03:38 PM IST
Tributes pour in for arun jaitley from telugu states

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటేరియన్ గా, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ అందించిన సేవలు మరువలేనివని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జైట్లీ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అరుణ్ జైట్లీ గారు ఇక లేరని వినాల్సి రావడం నిజంగా బాధాకరం. ఆయన తెలివైనవారు, స్నేహపూర్వకమైన వ్యక్తి. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశానికి గుర్తించదగ్గ సేవలను జైట్లీ అందించారు. ప్రతీసారి విలువలకు కట్టుబడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని జగన్ ట్వీట్ చేశారు.

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతిపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా జైట్లీ అందించిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు తెలిపారు. ఆయన కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో అందరికీ దూరం కావడం నిజంగా దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అరుణ్ జైట్లీ మృతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అరుణ్ జైట్లీ పరమపదించడం చాలా బాధ కలిగించిందంటూ ఓ వీడియో సందేశం వెలువరించారు. ఆయన న్యాయవాదిగానే కాకుండా, ఆర్థికమంత్రిగా, ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అప్పటి పరిస్థితులను ఎదుర్కొన్న విధానం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైల్లో మగ్గిన వైనం ఆయన స్థైర్యానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, సహచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitly Dead  Condolenses  Venkaiah Naidu  KCR  YS Jagan  Chandrababu  Pawan kalyan  BJP  Politics  

Other Articles