UP Residents Put Up Posters For "Missing" MP, MLA ‘‘మా ఎమ్మెల్యే, ఎంపీ జాడ చెబితే..రూ.501 బహుమానం’’

Up residents put out missing posters of mp mla announce reward of rs 501

mahesh sharma, gautam budh nagar residents, surajpur residents, greater noida, greater noida roads, roads condition, Member of Parliament, Member of Legislative Assembly, Rs501, Gift, Surajpur, Uttar Pradesh, Crime

The residents of Greater Noida of Uttar Pradesh have put out "missing" posters of their MP and MLA as a protest. The locals of Gautam Budh Nagar are protesting against the BJP MP Mahesh Sharma and MLA Tejpal Singh Nagar.

‘‘మా ఎమ్మెల్యే, ఎంపీ జాడ చెప్పండి.. రూ.501 బహుమతి పట్టుకెళ్లండి’’

Posted: 08/16/2019 11:08 AM IST
Up residents put out missing posters of mp mla announce reward of rs 501

తమ ప్రాంతాల్లో నెలకోన్న సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన ప్రజాప్రతినిధులపై ఒక్కో చోట ఒక్కోరకంగా ప్రజలు స్పందిస్తూ ఉంటారు. ఒక్కోక్కరు ఒక్కోలా తమ నిరసనను వ్యక్తం చేస్తుంటారు. కొందరు సదరు నేతలను నేరుగా నిలదీస్తే మరికొందరు మాత్రం వినూత్నంగా తమ నిరసన తెలుపుతారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగే నేతలు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాగానే తమ బస్తీలను చూడటానికి కూడా రావడం లేదని మండిపడుతున్నారు.

తాజాగా అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లో గ్రేటర్ నోయిడా పరిధిలోని సూరజ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలెపి గౌతమ్ బుద్దా నగర్ ప్రాంత వాసులు ఏకంగా తమ ఎమ్మెల్యు, ఎంపీలు కనిపించడం లేదని ఏకంగా పోస్టర్లు ఏర్పాటు చేసి తమ నిరసన తెలిపారు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే తేజ్‌పాల్ నాగర్, లోక్ సభ సభ్యుడు మహేశ్ శర్మ‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తమ గ్రామంలో డ్రైనేజీతో పాటు విద్యుత్ సమస్య ఉందని ప్రజలు పలుమార్లు ఈ నేతలకు విన్నవించుకున్నారు.

కరెంట్ స్తంభాలు దెబ్బతినడం వల్ల విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయనీ, దీన్ని మార్చాలని కోరారు. అయితే సదరు నేతలు వీరి విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారు. దీంతో సూరజ్ పూర్ వాసులకు చిర్రెత్తుకొచ్చింది. బాగా ఆలోచించిన గ్రామస్తులు తమ ఎమ్మెల్యే తేజ్‌పాల్ నాగర్, లోక్ సభ సభ్యుడు మహేశ్ శర్మ‌లు కనిపించడం లేదని బ్యానర్లు రూపొందించారు. వీటి జాడను తెలిపినవారికి రూ.501 బహుమానం ఇస్తామని అందులో ప్రకటించారు. వీటిని తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఊర్లు, రోడ్లపైకూడా అంటించారు. ఇది జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles