set back to JanaSena MLA Rapaka VaraPrasad ఎమ్మెల్యే రాపాక పరాభవం.. పతాకావిష్కరణకు లేని ఆహ్వానం

Set back to janasena mla rapaka varaprasad

Pawan Kalyan, Janasena, east godavari, MLA Rapaka Vara Prasad, Mamidikuduru, Flag Hoisting, AP Assembly, Assembly Speaker, YSRCP, CM Jagan, AP Capital Amaravathi, polavaram, Chandrababu, Nara Lokesh, TDP. BJP, Andhra Pradesh, Politics

Set Back to JanaSena MLA Rapaka VaraPrasad as Mamidikuduru MPDO didnot invite the public representative for flag hoisting programmen his razole constituency.

ఎమ్మెల్యే రాపాక పరాభవం.. పతాకావిష్కరణకు లేని ఆహ్వానం

Posted: 08/16/2019 10:01 AM IST
Set back to janasena mla rapaka varaprasad

రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టు నేపథ్యంలో స్థానికంగా నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఆయన లొంగుబాటు.. కోర్టు ఆయన కస్టడీ తిరస్కరణ.. చివరకు స్టేషన్ బెయిల్ తో బయటపడిన విషయం తెలిసిందే.  తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పీఎస్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్యేపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎస్ఐ తనను ఏకవచనంతో సంబోధించడంపై మండిపడ్డ ఎమ్మెల్యేపై కేసు నమదైయ్యింది.

ఈ కేసు నుంచి బెయిలుపై బయటపడిన ఆయన మరోసారి పరాభవం ఎదురైంది. రాష్ట్ర అధికారుల నుంచి ఆయనకు ఎలాంటి మద్దతు ఎంతటి స్థాయిలో లభిస్తుందో పంద్రాగస్టు రోజున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు మనకు కళ్లకు కట్టినట్టు చూపెడుతున్నాయి. అదెలా అంటే.. పతాకావిష్కరణ నేపథ్యంలో కనీసం స్థానిక శాసనసభ్యుడైన రాపాకకు ఎలాంటి అహ్వానం లేదు సరికగా ఎలాంటి పిలుపు కూడా లభించకపోవడం  జనసైనికులు కూడా మండిపడుతున్నారు.

దీంతో ఆగ్రహానికి గురైన రాపాక వరప్రసాద్ మామిడికుదురు ఎంపీడీవోను ఎందుకు తనను పతాకావిష్కరణకు అహ్వానించలేదని నిలదీశారు.  శాసనసభ్యుడిగా వున్న తనను స్వాతంత్ర్యదిన వేడుకలకు ఆహ్వానించకపోవడానికి గల కారణాలు ఏంటని ఆయన వివరణ కోరారు. జనసేన ఎమ్మెల్యేని కాబట్టే పిలవకుండా అవమానించారని ఆరోపించారు. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని రాపాక స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  MLA Rapaka Vara Prasad  Mamidikuduru  Flag Hoisting  Andhra Pradesh  Politics  

Other Articles