pawan kalyan responds on MLA rapaka varaprasad arrest రాపాకకు పవన్ మద్దతు.. ప్రభుత్వానికి జనసేనాని అల్టిమేటం

Pawan kalyan responds on mla rapaka varaprasad arrest

Pawan Kalyan, pawan kalyan on rapaka, janasenani on rapaka, tension in razole, Janasena, east godavari, makilipuram police, tension in Razole, Andhra Pradesh, Politics

Janasena Party President Pawan Kalyan condemned the arrest of MLA Rapaka Varaprasad. The actor-turned-politician opined that it wasn’t correct to make a mountain out of a molehill.

రాపాకకు పవన్ కల్యాణ్ మద్దతు.. ప్రభుత్వానికి జనసేనాని అల్టిమేటం

Posted: 08/13/2019 03:01 PM IST
Pawan kalyan responds on mla rapaka varaprasad arrest

మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన వ్యవహారంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కేసు నమోదైన నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజల తరఫున పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజలు కోరిన మీదటే వారికి మద్దతుగా రాపాక స్టేషన్ కు వెళ్లారని, అంతమాత్రానికే కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. పోలీసులు ప్రజాప్రతినిధికి ఇచ్చే మర్యాద ఇదేనా.. అంటూ ప్రశ్నించారు.

అదే సమయంలో ఎమ్మెల్యేలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కేసులు పెడతామని, వారిపై కూడా వెనువెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు వ్యవహరిస్తే మంచిదేనని.. మరి అధికార పార్టీ ఎమ్మెల్యే విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. నెల్లూరులో ఓ జర్నలిస్టుపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు మలికిపురం ఘటనలో గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చారని విమర్శించారు.

ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన కార్యకర్తలు, నేతలు సంయమనంతో వ్యవహరించాలని పవన్ సూచించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం తాను రంగంలోకి దిగుతానని జనసేనాని స్పష్టం చేశారు. మలికిపురం ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమీక్షిస్తున్నానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles