jio gigafiber basic plan starts at Rs 700 జియో బేసిక్ ప్లాన్ రూ.700, టీచర్స్ డే నుంచే సేవలు

Jio gigafiber basic plan starts at rs 700 at 100mbps

reliance agm 2019, Mukesh Ambani, jio gigafiber welcome offer, jio gigafiber free led tv, Jio GigaFiber Data Plans, Jio GigaFiber, jio forever plan, basic plan, business

jio gigafiber cheapest data plan is priced at Rs 700 a month, and has speeds up to 100Mbps. The top-end plan comes at Rs 10,000 a month and provides access to broadband, Jio HomeTV and Jio's IoT.

జియో గిగాఫైబర్ బేసిక్ ప్లాన్ రూ.700, టీచర్స్ డే నుంచే సేవలు

Posted: 08/12/2019 01:12 PM IST
Jio gigafiber basic plan starts at rs 700 at 100mbps

దేశంలో బ్రాడ్‌బ్యాండ్ యూజర్లె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో గిగా ఫైబర్ సేవలపై రిలయన్స్ తన కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. జీయో గిగా ఫైబర్ వస్తోందన్న సమాచారంతో ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఈ సేవలను కావాలని దరఖాస్లు చేసుకున్నారు. దీంతో ఇవాళ ముంబయిలో జరిగిన రిలయన్స్ ఏజీఎం మీటింగ్‌లో సంస్థ అధినేత ముఖేష్ అంబానీ గిగా ఫైబర్ సేవలపై ప్రకటన చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం రోజు నుంచి అనగా సెప్టెంబర్ 5 నుంచి బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా వార్షిక సర్వసభ్య సమావేశంలో.. టెలికాం రంగంలో దేశంలో ఒక సంచలనానికి తెరలేపిన జియో టెలికామ్.. గిగా ఫైబర్ తో మరో సంచలనం సృష్టిస్తుందని ముఖేశ్ అన్నారు. గిగా ఫైబర్ సేవల కోసం గతేడాదే రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని, ఇప్పటివరకు 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు తెలిపారు. గిగా ఫైబర్ సేవలతో బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్‌ ఒకే ప్యాకేజీలో అందిస్తున్నామన్నారు.

జియో గిగాఫైబర్ ప్రత్యేకతలు ఇవే...
* జియో గిగా ఫైబర్‌ సర్వీసులో రూ.700-10,000ల మధ్య ప్లాన్స్ ఉంటాయి.
* రూ.700 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది.
* గరిష్టంగా 1జీబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్‌తో ప్లాన్లు ఉన్నాయి.
* ల్యాండ్‌లైన్ ఫోన్, జియో4కే సెట్‌టాప్ బాక్స్ ఫ్రీగా ఇస్తారు.
* జియో ఫైబర్ తో అల్ట్రా హై డెఫినేషన్ ఎంటర్టైన్మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు అందిస్తోంది.
* ఇక జియో ఫైబర్ కస్టమర్లు హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ వంటి సేవలను కూడా పోందవచ్చు.
* ల్యాండ్‌లైన్ నుంచి దేశంలో ఎక్కడికైనా ఫ్రీగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jio gigafiber  Mukesh Ambani  welcome offer  basic plan  Data Plans  business  

Other Articles