man survives tonnes of debris, rescued alive after 8 days మృత్యుంజయుడు: 8 రోజుల తరువాత శిధిలాల నుంచి బయటకు..

This man survives tonnes of debris rescued alive after 8 days

man trapped under debris, man survives after 8 days, man survives tonnes of debris after 8 days, man survives in odisha, man survives in anugul, man survives in chandipath, crime

A man trapped under tonnes of debris was rescued by team of the Odisha Fire and Police Department in Anugul. The man has been identified as labour bajarah, who was trapped under the debris of concrete for 8 days.

మృత్యుంజయుడు: 8 రోజుల తరువాత శిధిలాల నుంచి బయటకు..

Posted: 08/01/2019 11:53 AM IST
This man survives tonnes of debris rescued alive after 8 days

ఒడిశాలో శిధిలాల నడుమ కూరుకుపోయిన ఓ కార్మికుడు 8 రోజుల తర్వాత సజీవంగా బయటపడి మృత్యుంజయుడిగా తిరిగివచ్చాడు. జూలై 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని అనుగుల్ జిల్లా చండిపదలో స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మిస్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే తమ తోటి సహచరుడు ప్రాణాలతో బయటపడిన నేపథ్యంలో తోటి కార్మికులు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని అనుగుల్ జిల్లా చండీపథలో జరుగుతున్న మరుగుదోడ్ల నిర్మాణంలో జార్ఖండ్‌కు చెందిన షేక్ బరాజా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత నెల 19న ఉదయం ఏటి కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. అయితే అదే సమయంలో తనపై ఓ పెద్ద గట్టు కూలిపోవడంతో అందులో కూరుకుపోయాడు. అదృష్టవశాత్తు తలమాత్రం బయటకు ఉండడంతో ప్రాణాలతో ఉండగలిగాడు. బహిర్భూమికి వెళ్లిన షేక్ బరాజా ఎంతకీ తిరిగిరాకపోవడంతో మిగతా కార్మికులు, కాంట్రాక్టర్ చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, బాధిత కార్మికుడు వెళ్లిన ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేకపోవడంతో అతడి ఆర్తనాదాలు వినే దిక్కు లేకుండా పోయింది. అయితే, అదృష్టవశాత్తు గత నెల 26న కొందరు గ్రామస్థులు ఆ ప్రాంతానికి వెళ్లడంతో వారిని చూసి షేక్ కేకలు వేశాడు. ఇసుకలో కూరుకుపోయి ఉన్న అతడిని చూసి నిర్ఘాంతపోయిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక సిబ్బందితో అక్కడికి చేరుకుని బాధితుడిని వెలికి తీశారు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : labour  shiekh bajara  debris  8 days  chandipath  anugul  odisha  crime  

Other Articles