High Court Serious on Rajahmundry Central Jail officials జైళ్లో ఎయిడ్స్ రోగుల పెరగడంపై హైకోర్టు సీరియస్..

High court seeks report on aids prisoners of rajahmundry central jail

rajahmundry central jail, rajamahendravaram, HIV Patients, 27 aids patients in central jail, AP High Court, increase in HIV patients, AIDS, High Court, Jail superintendent, Andhra Pradesh, Amaravathi, latest news

Andhra Pradesh High Court Serious on Rajahmundry Central Jail officials after seeking the reports on the increase of AIDS patients in the prisoners of the jail.

జైళ్లో ఎయిడ్స్ రోగుల పెరగడంపై హైకోర్టు సీరియస్..

Posted: 08/01/2019 01:18 PM IST
High court seeks report on aids prisoners of rajahmundry central jail

శతాబ్ధాల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఎయిడ్స్ వ్యాధి కలకలం రేపుతోంది. రోజురోజుకు ఎయిడ్స్ వ్యాధి బారినపడిన ఖైదీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో జైలులోని నిందితులు, దోషుల బంధువులు ఈ విషయమై తీవ్ర అంధోళన వ్యక్తం చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జైల్లోకి రాకముందు 19 మంది ఖైదీలకు ఎయిడ్స్ వ్యాధి ఉండగా, తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల ప్రకారం ఈ సంఖ్య మరింత పెరిగింది.

జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఏకంగా మరో తొమ్మిది మంది ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడటం అందోళన రేకెత్తిస్తోంది. దీంతో జైల్లోకి రాకముందే 19 మందికి ఎయిడ్స్ వ్యాధి బాధితులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 27కి పెరిగిందని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఖైదీ బుధవారం ఎయిడ్స్ వ్యాధి  కారణంగా తనకు రెండు నెలలు పాటు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. దాంతో కోర్టు జైల్లో ఎయిడ్స్ బాధితులపై ఆరా తీయగా అప్పుడు వ్యవహారం అంతా బయటకు వచ్చింది.

జైల్లో 27 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని జైళ్లశాఖ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. మెుత్తం జైల్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారని హైకోర్టు ఆరా తీయగా మెుత్తం 1500 మంది ఖైదీలు ఉన్నారని తెలిపింది. జైల్లో ఇంతమందికి ఎయిడ్స్ వ్యాధి ఉండటం సీరియస్ అంశమని హైకోర్టు అభిప్రాయపడింది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారో వివరాలతో సహా విచారణకు హాజరుకావాలని జైళ్ల సూపరింటెండెంట్ ను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles