Goa tourists can take more bottles of fenny గోవా పర్యాటకులకు కిక్కెకించే వార్త.. ఇక ఎన్నైనా..

Goa tourists can soon return home with more bottles of cheap liquor

goa tourism, goa travel, goa, goa news, goa tourists, goa holiday, goa beer, goa liquor, goa liquor rules, goa alcohol rules, tourists, Goa, liquor bottles, goa tourism, Pramod Sawant, Goa Chief Minister, goa beer, fenny

With mining and tourism facing a slump, the Goa government appears keen on literally 'hitting the bottle', to shore up revenues in the state treasury.

గోవా పర్యాటకులకు కిక్కెకించే వార్త.. ఇక ఎన్నైనా..

Posted: 07/31/2019 07:01 PM IST
Goa tourists can soon return home with more bottles of cheap liquor

గోవా వెళ్లే మందుబాబు టూరిస్టులకు గుడ్ న్యూస్. ఇకపై గోవా నుంచి ఎంత కావాలంటే అంత మద్యం ఇంటికి పట్టుకెళ్లొచ్చు. ఎన్ని లిక్కర్ బాటిల్స్ వెంట తీసుకెళ్లినా ఎవరూ నో చెప్పరు. ఎక్సైజ్ పోలీసులు కూడా అడ్డుకోరు, వేధించరు. ఈ మేరకు త్వరలో నిబంధనలు సడలించేందుకు గోవా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు.

''పొరుగు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ అధికారులతో త్వరలో చర్చలు జరుపుతాము. గోవాకి వచ్చే టూరిస్టులు ఇంటికి ఎన్ని లిక్కర్ బాటిల్స్ కావాలంటే అన్ని తీసుకెళ్లొచ్చు. వారిని అడ్డుకోవద్దని కోరతాము. పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పొరుగు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ అధికారులతో చర్చలు జరుపుతాము'' అని సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. మైనింగ్, టూరిజం ద్వారా గోవా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది.

దీంతో ఆదాయం పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఎంత కావాలంటే అంత మద్యం టూరిస్టులు తమ ఇంటికి తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని యోచిస్తోంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం.. గోవాకి వెళ్లే టూరిస్టులు.. ఒక్కో వ్యక్తి తమ వెంట రెండు కన్నా ఎక్కువ మద్యం బాటిళ్లు తీసుకెళ్లడానికి పర్మిషన్ లేదు. కేవలం ఒక ఐఎంఎఫ్ఎల్, ఒక లోకల్ లిక్కర్ బాటిల్ మాత్రమే వెంట తీసుకెళ్లొచ్చు.

అంతకుమించితే సమస్యలు తప్పవు. గోవా సరిహద్దుల్లోకి రాగానే టూరిస్టులను అడుగడుగునా ఎక్సైజ్ పోలీసులు చెక్ చేస్తారు. లిక్కర్ బాటిల్స్ కనిపిస్తే సీజ్ చేస్తారు. దీంతో టూరిస్టులు ఎక్కువ మందు బాటిళ్లు వెంట తెచ్చుకోవడానికి భయపడుతున్నారు. ''ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక వ్యక్తి తన వెంట రెండు కన్నా ఎక్కువ మద్యం బాటిళ్లు తీసుకెళ్లేలా పర్మిషన్ ఇస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఒక టూరిస్టు తన వెంట ఒక ఐఎంఎఫ్ఎల్, లోకల్ లిక్కర్ బాటిల్ వెంట తీసుకెళ్లొచ్చు. పొరుగు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడతాము. గోవా లిక్కర్ ని ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాం. దాంతో పాటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది'' అని సీఎం సావంత్ అన్నారు. ప్రస్తుతం లిక్కర్ అమ్మకాల ద్వారా గోవా ప్రభుత్వానికి ఏటా రూ.500 కోట్ల ఆదాయం వస్తోంది. ప్రతి ఏడాది 8 మిలియన్ టూరిస్టులు గోవాకి వస్తుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tourists  Goa  liquor bottles  goa tourism  Pramod Sawant  Goa Chief Minister  goa beer  fenny  

Other Articles