Naxal commander Linganna killed in encounter ఎన్ కౌంటర్లో మావోయిస్టు కమాండర్ లింగన్న మృతి

Naxal commander linganna killed in encounter with telangana police

Maoist leader killed, new democracy group commander, commander lingana killed, police maoists encounter, Naxal leader killed, Naxals, Naxal commander, encounter in Bhadradri-Kothagudem District, encounter in telangana, Telangana, crime

The 'commander' of an armed underground Naxal group was killed in an alleged encounter with the police in a forest area in Bhadradri-Kothagudem District of Telangana, police said.

ఎన్ కౌంటర్లో మావోయిస్టు కమాండర్ లింగన్న మృతి

Posted: 07/31/2019 08:28 PM IST
Naxal commander linganna killed in encounter with telangana police

మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని పందిగుట్టపై లింగన్న దళం వుందని పక్కగా ఉప్పందడంతో.. వారిని చుట్టుముట్టి జరిపిన ఎన్ కౌంటర్లో న్యూ డెమొక్రసీ దళ కమాండర్  లింగన్న మృతిచెందాడు. ఈ క్రమంలో పోలీసులు లింగన్న మృతదేహాన్ని తరలిస్తుండగా, స్థానిక అటవీప్రాంతంలోని ప్రజలు ఎదురుతిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని పందిగుట్టపై గత మూడు రోజులుగా లింగన్న దళం అక్కడే వుందన్న పక్కా సమాచారంతో పోలీసులు చుట్టుముట్టారు. అప్రమత్తమైన మావోలు పోలీసులపైకి కాల్పులకు పాల్పడ్డారని, దీంతో ఎదురుకాల్పులకు పోలీసులు దిగారని, ఈ కాల్పుల్లో దళ కమాండర్ లింగన్న మృతి చెందగా, మరో ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, లింగన్న మృతిచెందిన సమాచారం అందుకున్న అడవి బిడ్డలు.. ఆయన మృతదేహాన్ని కూడా పోలీసులు తరలిస్తున్నారన్న సమాచారం పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులపై రాళ్లదాడికి దిగారు. లింగన్న మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులను ఘటనాస్థలం నుంచి తరిమేందుకు ప్రత్యామ్నాయం లేని పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

లింగన్న న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఈ కాల్పుల అనంతరం రెండు గంటల పాటు ప్రజలు, మీడియాను పోలీసులు అనుమతించలేదు. ప్రజలు గొడవ చేయడంతో అనుమతించారు కానీ వారు వెళ్లేలోపు గుట్ట వెనుక వైపుగా లింగన్న మృతదేహంతో వెళ్లిపోయేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు యత్నించిన వారిపై ప్రజలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maoists  new democracy group  commander lingana  Tension  encounter  Telangana  crime  

Other Articles