BS Yediyurappa wins Trust Vote in Karnataka Assembly బలం నిరూపించుకున్న బీజేపి.. సిద్దయ్య కీలక వ్యాఖ్యలు..

Bs yediyurappa wins trust vote in karnataka assembly

Karnataka, Yediyurappa, Karnataka government, Speaker Ramesh Kumar, siddaramaiah, congress, BJP, disqualified MLAs, CM Yediyurappa, Politics

Karnataka Chief Minister B S Yediyurappa-led BJP government on Monday proved the majority in the Assembly, winning a floor test in the House

బలం నిరూపించుకున్న యడ్యూరప్ప.. సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు..

Posted: 07/29/2019 02:41 PM IST
Bs yediyurappa wins trust vote in karnataka assembly

కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప సర్కార్ విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. 207 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ నిరూపణకు 104 మంది సభ్యులు అవసరం ఉండగా, బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా 106 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఇండిపెండెంట్ కూడా మద్దతు పలకడంతో, మేజిక్ ఫిగర్ ను యడ్డీ సర్కారు అధిగమించింది. విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా 100 ఓట్లు వచ్చాయి.

కాగా, యడ్డీకి ముందున్న కాలం అంత సులువేమీ కాదని, అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో కనీసం 8 స్థానాల్లో విజయం సాధించకుంటే, ఆ ప్రభుత్వం తిరిగి పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ 17 స్థానాలూ కాంగ్రెస్, జేడీఎస్ సిట్టింగ్ స్థానాలని, ఈ ప్రాంతాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదని గుర్తు చేస్తున్న విశ్లేషకులు, సగం స్థానాల్లో బీజేపీ గెలవకుంటే, ప్రభుత్వం తిరిగి మైనారిటీలో ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరిస్తున్నారు.

అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వేళ జరిగిన చర్చలో పాల్గొన్న మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని నడిపించేందుకు అందరినీ కలుపుకు పోతానని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని అంటూనే చురకలు వేశారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ముంబైలోని హోటల్ కు చేరిపోయారో, అప్పుడే తనకు యడియూరప్ప సీఎం అవుతారన్న సంగతి తెలిసిపోయిందని అన్నారు.

అయితే, ఆయన ముఖ్యమంత్రి పీఠంపై ఎంతకాలం ఉంటారో తనతో పాటు ఆయనకు కూడా తెలియదని సెటైర్ వేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రతి ఒక్కరితో చర్చలు జరపాలని సూచించారు. ముఖ్యంగా సామాన్యుల సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని, నీటి సమస్య పరిష్కారానికి శ్రద్ధ చూపాలని కోరారు. రైతు సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన యడియూరప్పను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, వారి పొలాలకు సాగునీటిని తెప్పిస్తే చాలని అన్నారు.  

ఇక ఊహించినట్టుగానే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్, తన పదవికి రాజీనామా చేశారు. యడియూరప్ప ప్రభుత్వం విజయం సాధించగానే, సభ ఆర్థిక బిల్లుకు ఆమోదం పలికింది. ఆ వెంటనే తన రాజీనామా లేఖను ఆయన చదివారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, స్పీకర్ గా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను సభలో పక్షపాతం లేకుండా వ్యవహరించానని, ఏ నిర్ణయం తీసుకున్నా నిబంధనలకు అనుగుణంగానే తీసుకున్నానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yediyurappa  siddaramaiah  congress  BJP  disqualified MLAs  Karnataka  Politics  

Other Articles