Woman Dies in Fight Over Drinking Water at Public Tap in Srikakulam శ్రీకాకుళంలో నీళ్ల కోసం మహిళల ఘర్షణ... ఒకరి మృతి

Woman dies in fight over drinking water at public tap in srikakulam

Drinking Water, Padma, Srikakulam, Woman Dies in Fight

Woman Dies in Fight Over Drinking Water at Public Tap in Srikakulam

శ్రీకాకుళంలో నీళ్ల కోసం మహిళల ఘర్షణ... ఒకరి మృతి

Posted: 07/16/2019 11:57 AM IST
Woman dies in fight over drinking water at public tap in srikakulam

బిందెడు నీళ్లు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో తాగునీటి కుళాయి వద్ద మహిళలు బిందెలతో కొట్టుకోవడంతో పద్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మంచి నీళ్లు కోసం వెళ్లిన మహిళ చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాటిపూడి పద్మ మంచినీటిని పట్టుకొనేందుకు కుళాయి వద్ద క్యూలో నిల్చుంది.  నీటిని పట్టుకొనే విషయంలో  మహిళలు పోటీలు పడ్డారు. క్యూ తప్పింది. దీంతో  మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  దీంతో మహిళలు బిందెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకొన్నారు. ఈ క్రమంలో కుళాయి నాచుపై కాలు పడి పద్మ కింద జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది.ఈ విషయమై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drinking Water  Padma  Srikakulam  Woman Dies in Fight  

Other Articles