Rahul Gandhi Resigns as Congress President

Rahul gandhi resigns as congress president

Rahul Gandhi, Rahul Gandhi news, Rahul Gandhi updates, Rahul Gandhi latest, Rahul Gandhi new, Rahul Gandhi next, Rahul Gandhi position, Rahul Gandhi resignation, Rahul Gandhi Congress President

All India Congress President Rahul Gandhi submitted his resignation and blamed himself for the party's poor show in the recent Lok Sabha polls.

రాజీనామా చేశా.. అందరికీ ధన్యవాదాలు: రాహుల్ గాంధీ

Posted: 07/04/2019 11:21 AM IST
Rahul gandhi resigns as congress president

ఎట్టకేలకు రాహుల్‌ గాంధీ తన పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్‌ గాంధీ బుధవారం బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్‌కు కొత్త సారథిని వెంటనే ఎన్నుకోవాలని పార్టీ వర్కింగ్ కమిటీకి రాహుల్ సూచించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి తనదే బాధ్యత అని అంగీకరించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీకి రాసిన నాలుగు పేజీల లేఖను బుధవారం ఆయన ట్విటర్‌ ద్వారా బహిర్గతం చేశారు. తన స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసే బాధ్యతను ఒక బృందానికి అప్పగించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి సూచించారు.

రాజీనామాపై రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో నేతలంతా రాజీనామాలు చేశారు. సీనియర్ నేతలు రాహుల్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, ఆయన తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాహుల్ నిర్ణయానికే మొగ్గు చూపినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లతో సరిపెట్టుకుంది. మోదీ ప్రభంజనం ముందు ఆ పార్టీ నిలవలేకపోయింది. ఈ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావటం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని లేఖలో రాహుల్‌ పేర్కొన్నారు. తన పట్ల విశ్వాసం, ప్రేమ చూపిన దేశ ప్రజలకు, పార్టీకి ఎంతో రుణపడి ఉంటానన్నారు. తన స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలని సీడబ్ల్యూసీకి గతంలోనే చెప్పానన్నారు. ఎన్నికల్లో వైఫల్యానికి అనేక మంది పార్టీ నేతలు కూడా బాధ్యత వహించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎంతో శ్రమించానని, ఈ పోరులో దాదాపు ఒంటరిగా నిలిచానని, అయినా అది తనకు గర్వంగానే ఉందని రాహుల్‌ చెప్పారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Congress  

Other Articles

Today on Telugu Wishesh