Navneet Kaur-Rana Wins over shiv sena MP నాటి టాలీవుడ్ అందాల బామ.. నేటి పార్లమెంట్ సభ్యురాలు

Southern star navneet kaur rana win over 5 time shiv sena mp anandrao adsul

Lok Sabha election 2019, Lok Sabha polls, maharashtra, Navneet Kaur-Rana, South Indian actress, Ravi Rana, Anandrao Adsul, shiv sena, Yuva Swabhiman Party, South Indian actress Navneet Kaur-Rana, Mumbai, Maharashtra Politics

Well-known South Indian actress Navneet Kaur-Rana is the Yuva Swabhiman Party elected Member of parliament from Amravati in eastern Maharashtra, supported by the 56-party Congress-led Grand Alliance.

నాటి టాలీవుడ్ అందాల బామ.. నేటి పార్లమెంట్ సభ్యురాలు

Posted: 05/25/2019 12:42 PM IST
Southern star navneet kaur rana win over 5 time shiv sena mp anandrao adsul

తెలుగులో అనేక చిత్రాలలో హీరోయిన్ పాత్రలను వేసి.. పలు చిత్రాలలో కీలక పాత్రలను పోషించిన నటి నవనీత్ కౌర్ గుర్తుందా.? అమె గురించి ఇప్పుడెందుకు అంటారా.? అమె ఇప్పుడు సాధారణ మహిళ కాదు. నటి, మోడల్ అంతకన్నా కాదు. అమె ఏకంగా పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ముప్పై మూడేళ్ల ఈ ఒకనాటి నటి తాజాగా చట్టసభలోకి అడుగుపెట్టనున్నారు. తెలుగులో హిట్టయిన శీను వాసంతి లక్ష్మి చిత్రంలో అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన ఈమె ఇక చట్టసభలోనూ అందరి మన్ననలను పోందేలా, ప్రజాఅభీష్టం మేరకు నడుచుకుంటానని అంటున్నారు.

నవనీత్ కౌర్ 2010 చివర్లో సినిమాలకు వీడ్కోలు పలికి.. మహారాష్ట్రాకు చెందిన రవి రాణా అనే రాజకీయ నేతను, ఎమ్మెల్యేను పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలో అడుగుపెట్టింది. ఆ తరువాత భర్త అడుగుజాడల్లోనే నవనీత్ కౌర్ రాజకీయాల్లోకి ప్రవేశించడమే కాదు, ఏకంగా ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. 2014లో ఓటమిని చవిచూసిన ఈమె మరోమారు ముంబైలోని అమరావతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలో దిగి.. శివసేన దిగ్గజ నేతను ఢీకొన్నారు. తొలిసారి ఆనంద్ రావు అద్సూల్ చేతిలో పరాజయం పాలైయ్యారు.

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి శివసేన దిగ్గజ నేత ఐదు పర్యాయాల ఎంపీ ఆనంద్ రావు అద్సూల్ పై 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఆమె భర్త రవి రాణా మొదటి నుంచి యువ స్వాభిమాన్ పార్టీ తరఫున పోటీచేస్తున్నారు. నవనీత్ కౌర్ కూడా అదే పార్టీ తరఫున ఎంపీగా పోటీచేశారు. ఈ పార్టీ మహారాష్ట్రలోని శరద్ పవార్ నేతృత్వంలో గల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికల బరిలో దిగారు. కాగా గత ఎన్నికలలో అమె ఎన్సీపీ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిని చవిచూశారు.

కాగా ఈ సారి అమెకు అటు కాంగ్రెస్, ఇటు ఎన్సీసీ పార్టీల మద్దుత పలకడంతో అమె విజయం సాధించారు. నవనీత్ కౌర్ గెలుపులో బాలీవుడ్ నటుడు గోవిందా కూడా కీలక పాత్ర పోషించాడు. అమరావతి నియోజకవర్గంలో అమెకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. దీంతో నవనీత్ కౌర్ కు 5 లక్షల 10 వేల ఓట్లు పోలయ్యాయి. నవనీత్ కౌర్ భర్త రవి రాణా ఎవరో కాదు, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు మేనల్లుడు. 2011లో రవి రాణా, నవనీత్ కౌర్ జోడీ, 3100 ఇతర జంటలతో కలిసి సామూహిక వివాహ మహోత్సవంలో ఒక్కటైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles