After second fail, Lagadapati quits survey game సర్వేల నుంచి కూడా లగడపాటి సన్యాసం..

Exit poll prediction raadhu after second fail lagadapati rajagopal quits game

Lagadapati, Lagadapati Rajagopal, Exit Poll, Troll, netizens, Twitterities, lok sabha elections, assembly elections, andhra pradesh, telangana, politics

After getting trolled mercilessly for getting the poll predictions wrong for a second time in a row, Lagadapati has taken a vow to quit the prediction game altogether. Admitting his failure to make the right predictions.

సర్వేల నుంచి సన్యాసం తీసుకున్న లగడపాటి..

Posted: 05/24/2019 05:36 PM IST
Exit poll prediction raadhu after second fail lagadapati rajagopal quits game

ఆంధ్ర ఆక్టోపస్‌గా పేరుపొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్న ఐదేళ్ల తరువాత తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సర్వేలు చేయబోనని.. సర్వేల నుంచి కూడా తాను సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వరుసగా రెండు సార్లు తన సర్వేలు విఫలం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లగడపాటి రాజగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజానాడి పసిగట్టడంలో రెండుసార్లు విఫలం అయినందుకు గాను ఇకముందు సర్వేలకు దూరంగా ఉండదలుచుకున్నాను.’ అని ఆ ప్రకటలో పేర్కొన్నారు.

ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలు.. అసలు ఫలితాలకు దగ్గరగా ఉండేవి. దీంతో లగడపాటి రాజగోపాల్ సర్వేలు అంటే క్రేజ్ ఉండేది. అయితే, 2018 తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో ఆయన చెప్పిన లెక్కలు తారుమారు అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ - టీడీపీ మహాకూటమి ప్రభుత్వంలోకి వస్తుందని లగడపాటి చెప్పారు. అయితే, ఆఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 117 సీట్లకు గాను 88 స్థానాల్లో విజయం సాధించింది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని లగడపాటి చెప్పారు. టీడీపీకి 100కు పైగా సీట్లు వస్తాయని, వైసీపీకి 69 వరకు సీట్లు రావొచ్చని అంచనా వేశారు. కానీ, వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 175కు గాను 151 సీట్లు సాధించింది. అధికార టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితం అయింది. జనసేన ఒక్క సీటు సాధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తారని, ఆయన అసెంబ్లీలో అడుగుపెడతారంటూ లగడపాటి చెప్పిన విషయం కూడా ఫెయిలైంది. వరుసగా ఆయన సర్వేలు విఫలం కావడంతో లగడపాటి రాజగోపాల్ పరువు పోయింది. దీంతో ఇకపై తాను సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తన సర్వేల వలన ఎవరైనా నొచ్చుకుని ఉంటే మన్నించగలరని లగడపాటి కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles