man tries to enter vishaka airport with knife విశాఖ విమానాశ్రయంలో ‘కత్తి’ కలకలం..

Man held for attempting to enter vishaka airport with knife

Tension at vishaka airport, man tries to enter vishaka airport with knife, youth with razor, lovaraju, paravada, visakhapatnam, vishaka airport, latest news, crime, politics

Just before the new government takes its shape, a knife in Visakhapatnam had created tensions once again. A man carried it to the parking in gate where he was arrested by CRPF. The man was identified as Lova Raju from Paravada.

విశాఖ విమానాశ్రయంలో ‘కత్తి’ కలకలం.. అగంతకుడి అరెస్టు

Posted: 05/24/2019 03:45 PM IST
Man held for attempting to enter vishaka airport with knife

విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో ‘కత్తి’ కలకలం రేపింది. సరిగ్గా కోడి కత్తి కేసులో అరెస్టైయిన శ్రీనివాస్ కు బెయిల్ లభించిన ఆయన జైలు నుంచి విడుదలైన రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఓ వ్యక్తి ఏకంగా వేటకత్తితో విమానాశ్రయంలోకి వెళ్లేందుకు యత్నించాడు. విమానాశ్రయం పార్కింగ్ ఇన్ గేట్ వరకూ వెళ్లిన అతడ్ని తనఖి చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించింది.

వివరాల్లోకి వెళ్తే వేట కత్తితో ఎయిర్ పోర్టుకు లోనికి ప్రవేశించేందుకు ఓ వ్యక్తి యత్నించగా.. అతన్ని గమనించిన సీఆర్ఫీఎఫ్ సిబ్బంది.. తనిఖీ చేసి.. అతని వద్ద కత్తిని గుర్తించారు. వెంటనే విశాఖ విమానాశ్రయం పోలీసులకు పిర్యాదు చేశారు. సదరు వ్యక్తి పరవాడకు చెందిన లోవరాజుగా పోలీసులు గుర్తించారు. లోవరాజుకు మతి స్థిమితం లేదని, కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అతని బ్యాగ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, 2007 నుంచి ప్రభుత్వాసుపత్రిలో లోవరాజు చికిత్స పొందుతున్నారని, ఇందుకు సంబంధించిన పుస్తకం, మందులు ఆయన బ్యాగ్ లో ఉన్నాయని అన్నారు.  ఇప్పటికీ మతిస్థిమితం లేదని, పొంతన లేకుండా ఆయన మాట్లాడుతున్నాడని చెప్పారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : youth with razor  lovaraju  paravada  visakhapatnam  vishaka airport  latest news  crime  politics  

Other Articles