20 Dead in Surat Fire, Students Jump Out of Roof సూరత్ కోచింగ్ సెంటర్లో ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

Surat fire 20 killed in coaching centre blaze horrific visuals show kids falling off burning building

fire in Surat, Surat fire video, surat fire incident, Surat coaching centre fire, Fire in a commercial complex in Surat, 10 killed in Surat fire, commercial complex fire, Surat news today, Fire at shopping complex in Surat, surat fire news today, shopping complex in Surat, takshashila complex surat, Gujarat, politics

At least 20 people were killed after they jumped off a commercial complex in Surat on Friday, 24 May, after it caught fire. Most of them are reported to be students of a coaching class called Aloha Classes.

ITEMVIDEOS: సూరత్ కోచింగ్ సెంటర్లో ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

Posted: 05/24/2019 06:20 PM IST
Surat fire 20 killed in coaching centre blaze horrific visuals show kids falling off burning building

గుజరాత్‌లోని సూరత్‌లో సర్తానా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బహుళ అంతస్థుల భవనం ఐదో అంతస్థులో వున్న కోచింగ్‌ సెంటర్‌ ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. కొద్దిక్షణాల్లోనే అవి తీవ్ర రూపం దాల్చాడంతో 20 మంది విద్యార్థులు మృతిచెందినట్టు సమాచారం. ప్రాణాల్ని కాపాడుకొనే క్రమంలో పలువురు విద్యార్థులు భవనంపైనుంచి కిందకు దూకేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

గుజరాత్ లోని సూరత్ పట్టణంలోగల సర్తానా ప్రాంతంలో తక్షశిల కమర్షియల్ కాంప్లెక్స్ అనే బహుళ అంతస్థు భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భవనంలోని ఐదవ అంతస్థులో వున్న ఓ కోచింగ్ సెంటర్ అలోహా తరగతులను నిర్వహిస్తోంది. ఈ తరగతులకు విద్యార్థులు హాజరైన క్రమంలో అదే కోచింగ్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అవి ఒక్కఉదుటన వ్యాపించడంతో దట్టమైన పోగ అలుముకుంది. దీంతో విద్యార్థులు తప్పించుకునేందుకు మార్గం లేకపోవడంతో తరగతుల నుంచి బయటకు వచ్చి కిందకు దూకేశారు.

మరికోందరు విద్యార్థులు బయటకు వచ్చే మార్గం లేక దట్టమైన పోగలో చిక్కకుని ప్రాణాలను కొల్పోయారు. కిందకు దూకడంతో విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనా స్థలంలో 18 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై సూరత్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ, ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. కాగా, ఇంత పెద్ద ప్రమాదం కళ్లముందు జరుగుతున్నా.. స్థానికులు కొందరు సహాయ చర్యలు చేపట్టగా అక్కడ గుమ్మిగూడిన అనేక మంది మాత్రం విద్యార్థులు భవనంపై నుంచి దూకే దృష్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారు.

ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

సూరత్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘సూరత్‌లో జరిగిన భయానక అగ్ని ప్రమాదం నన్నెంతో కలిచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. బాధితులను సత్వరమే ఆదుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని, స్థానిక అధికారులను కోరా’ అని మోదీ తన ట్విటర్‌లో పేర్కొన్నారు.  మరోవైపు, ఈ ఘటనపై సీఎం విజయ్‌రూపానీ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles