The democracy and its people have won: PM Modi ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఘట్టం: ప్రధాని మోడీ

Pm modi vows every moment of my life every fibre of my being devoted to nation

lok sabha election results, lok sabha election results 2019, todays election results 2019, live election results 2019, election results live, today election results live updates, election results, election results, Elections, UPA, NDA, BJP, Congress, DMK, PM Modi, Rahul Gandhipolitics

Prime Minister Narendra Modi promised to devote "every moment" of his time and "every fibre" of his being for the people of India and said the country will now have only two castes -- the poor and those who want to alleviate poverty.

ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఘట్టం: ప్రధాని మోడీ

Posted: 05/23/2019 09:04 PM IST
Pm modi vows every moment of my life every fibre of my being devoted to nation

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 355 స్థానాలు లభించడం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఘట్టం అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. బీజేపీకి సొంతంగా అత్యధిక స్థానాలు వచ్చినా సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. ఇది సామాన్య ప్రజల విజయమని, నిజాయితీ గల ప్రజల తీర్పని అయన పేర్కోన్నారు. ఇది బీజేపి పార్టీ సాధించిన విజయమో లేక నరేంద్రమోడీ సాధించిన విజయమో కాదని ఇది పూర్తిగా ప్రజావిజయమని ఆయన అన్నారు.

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ మరింత మెరుగైన జీవనం కోరుకుంటున్న సామాన్యుల విజయంగా పేర్కోన్నారు. మోదీ సర్కారు ఈ ఐదేళ్లలో తమ కోసమే పనిచేసిందని ప్రజలు విశ్వసించారని తెలిపారు. బీజేపీ దార్శనికతను ప్రతిబింబించేలా పనిచేశామని, ప్రజలు సైతం సాధికారత కోసం ఓట్లేశారని వివరించారు. ఎన్డీఏ కూటమిపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కట్టబెట్టిన ఘన విజయం తమకు మరింత బాధ్యత పెంచిందనీ.. ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి మరింత కష్టపడతామని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన ఎన్నికలను ఎంతో పారదర్శకంగా, సాఫీగా జరిగేలా చూసిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. భారీ ప్రజాసామ్య క్రతువులో పాల్గొన్న ఓటర్లకు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత విధులు నిర్వహించిన బలగాలకు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తమను ఎన్నుకునేందుకు యావత్ భారతం ఏకమైందని కొనియాడారు. నవభారతానికి ఇది శిలాశాసనం లాంటి విజయం అని మోదీ అభివర్ణించారు. ఈ విజయం తనను దేశ ప్రజల కోసం మరింతగా శ్రమించేందుకు సిద్దం చేస్తోందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lok sabha elections results  UPA  NDA  BJP  Congress  DMK  PM Modi  Rahul Gandhi  politics  

Other Articles