Rahul Gandhi wins Wayanad by over 8 lakh votes ఆల్ టైం రికార్డును తన పేరున లిఖించుకున్న రాహుల్ గాంధీ

Rahul gandhi wins wayanad by over 8 lakh votes highest margin

Lok Sabha Polls 2019, General Elections 2019, Kerala, Rahul Gandhi, Wayanad, Amethi, National Politics

Voters of Wayanad Lok Sabha constituency wondered if Rahul Gandhi as opposition MP would be able to develop it, as local Congress-led UDF workers burst crackers May 23 celebrating a 'resounding win' of the Congress chief with a record-breaking margin from the seat.

ఆల్ టైం రికార్డును తన పేరున లిఖించుకున్న రాహుల్ గాంధీ

Posted: 05/23/2019 08:09 PM IST
Rahul gandhi wins wayanad by over 8 lakh votes highest margin

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్ అఖండ మెజారిటీతో విజయం సాధించారు. గతంలో ఉన్న రికార్డులన్నీ చెరిపివేసి అత్యంత మెజారిటీతో గెలిచిన ఎంపీగా పార్లమెంట్‌లో రాహుల్ అడుగుపెట్టబోతున్నారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ 13,37,438 ఓట్లు గెలుచుకున్నారు. అధికార ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి పీపీ సునీర్‌కు 4,99,067 ఓట్లు లభించాయి. దీంతో రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు.

ఇందులో విశేషం ఏంటంటే 8,38,371 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఏకైక ఎంపీగా రాహుల్ రికార్డు సృష్టించారు. 2014లో ఉప ఎన్నికలో బీజేపీ నేత ప్రితమ్ గోపీనాథ్‌రావు ముండే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. బీడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.పాటిల్‌పై ఆయన 6,96,321 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక సాధారణ ఎన్నికలో పశ్చిమ బెంగాల్‌ నుంచి సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5,92,502 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఇదిలావుండగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నుంచి ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి గట్టి పోటీని ఎదుర్కెంటున్న రాహుల్ గాంధీ.. చిట్టచివరికి అమె చేతిలో పరాజయాన్ని చవిచూశారు. గత పర్యాయం ఇదే నియోజకవర్గంలో అమెను ఏకంగా లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఓడించిన రాహుల్ గాంధీ.. ఈ సారి కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో దేశవ్యాప్తంగా పార్టీ ప్రచారబాధ్యతలను తన భుజాలపై వేసుకుని ప్రచారం నిర్వహించి.. అమేధీని అంతగా పట్టించుకోలేదు. దీనికి తోడు ఇన్నాళ్లు తమకు అక్కడ మద్దతుగా వున్న ఓ సీనియర్ నేత కూడా పార్టీకి దూరం కావడం కూడా రాహుల్ ఓటమికి కారణమని విశ్లేషకులు భావన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles