Kavitha trailing with huge margin కల్వకుంట్ల కవితకు పసుపు రైతు దెబ్బ.. ముందంజలో బీజేపి

Kavitha trailing with huge margin arvind dharmapuri leads in nizamabad

Kavitha, Kalvakuntla Kavitha, Arvind Dharmapuri, Turmeric farmers, Turmeric board, Nizamabad parliament constituency, Telangana politics

Bharatiya Janata Party candidate, Arvind Dharmapuri is leading in Nizamabad and Kavitha is trailing in the same constituency. Arvind is leading with 31,000 votes against Kavitha.

కల్వకుంట్ల కవిత వెనుకంజ.. భారీ అధిక్యంలో ధర్మపూరి అరవింద్..

Posted: 05/23/2019 02:33 PM IST
Kavitha trailing with huge margin arvind dharmapuri leads in nizamabad

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్నట్లుగానే అధికార పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు అక్కడి పసుపు, ఎర్రజోన్న రైతుల ప్రభావం బాగానే తాకింది. ఏకంగా 170 మంది రైతులు ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలివడంతో ఈ నియోజకవర్గంలో ఫలితం ఎలా వుండబోతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీంతో ఇవాళ ఉదయం నుంచి వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వున్నాయి.

ముఖ్యమంత్రి తనయ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కొనసాగగుతున్న అమె.. సిట్టింగ్ పార్లమెంటు అభ్యర్థిగా నిజామాబాద్ నుంచి మరోమారు బరిలో నిలిచారు. అయితే ఇక్కడ అమెకు రైతులతో పాటు బీజేపి ఎంపీ అభ్యర్థి ధర్మపూరి అరవింద్ కూడా అమెకు సమస్యగా మారారు. అమె విజయంలో గతంలో కీలక పాత్ర పోషించిన రైతులు, ఇప్పుడు వ్యతిరేకంగా మారారు. దీంతో ఇవాళ ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అమె ప్రతీ రౌండ్ లోనే పరాభావాన్నే ఎదురుచూస్తున్నారు.

అన్ని రౌండ్లలో నిజమాబాద్ బీజేపి అభ్యర్థి దర్మపూరి అరవింద్ ముందంజలో కొనసాగుతున్నారు. అరవింద్‌ 18వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తన తండ్రి మాజీ మంత్రి, మాజీ పిసీసీ అధ్యక్షుడు ధర్మపూరి శ్రీనివాస్ ను గత డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నుంచి ఉద్వాసన పలికారు. దీంతో తన తండ్రికి జరిగిన పరాభావంపై ఆయన సీఎం కేసీఆర్ తనయ కవితపై ప్రతీకారం తీర్చుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక్కడి నుంచి 160 మందికిపైగా రైతులు పోటీలో నిలవడంతో ఈ ఎన్నిక నిర్వహణ ఈసీకి సవాల్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles