Baig's outburst to give new direction to Ktaka politics: Gowda ‘‘కుమారస్వామీ.. రేపు సాయంత్రం వరకే నువ్వు సీఎం..’’

Roshan baig s outburst to give new direction to karnataka politics bjp

BJP operation akarsh, BJP traps Congress leaders, sadananda gowda, kumara swamy, dinesh gundu rao, roshan baig, siddaramaiah, kc venugopal, Exit polls, JDS, Congress, BJP, Karnataka, politics

Senior BJP leader and Union Minister D V Sadananda Gowda said Karnataka Congress legislator R Roshan Baig's outburst against his party leadership will give a "new direction" to the state politics.

‘‘కుమారస్వామీ.. రేపు సాయంత్రం వరకే నువ్వు సీఎం..’’

Posted: 05/22/2019 04:06 PM IST
Roshan baig s outburst to give new direction to karnataka politics bjp

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపి వాడిన ఆకర్ష్ పాచిక.. ఇన్నాళ్లుగా పారకపోయినా.. ఇప్పుడిక పారాల్సిందేననా.? కుమారస్వామి పదవీచుత్యుడు కావాల్సిందేనా.. తండ్రి దేవెగౌడ తరహాలో కుమారస్వామికి కూడా సీఎం పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా.? అంటే  ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేదే మళ్లీ అధికారం అని తేల్చేయడంతో.. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వాలు కూలిపోతాయన్న ప్రచారం జోరందుకుంది. ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలకు అకర్షించేందుకు బీజేపి కొత్త అలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. ఆ ప్రభుత్వం అధికారం కోల్పోబోతోందని, రేపు సాయంత్రం వరకే కుమారస్వామి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారని కేంద్ర మంత్రి సదానందగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు ఈ మేరకు ప్రకటను చేసిన యడ్యూరప్ప మౌనంగా వున్న సమయంలో సదానంద గౌడ.. కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు సమయం ఆసన్నమైందని ప్రకటన చేయడం గమనార్హం. కాగా, ఈ ప్రకటన ఆయనే చేశారా.? లేక ఆయన చేత.. పార్టీ పెద్దలే వెనకుండి ఇలా చెప్పించారా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. కాగా, సదానందగౌడ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ జోకర్‌ అని రోషన్‌ బేగ్‌ తిట్టిపోసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే అత్యధిక సీట్లు దక్కుతాయంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో రోషన్‌ బేగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో రోషన్‌ బేగ్‌ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారి తీస్తుందని వ్యాఖ్యానించిన సదానంద గౌడ.. రేపు సాయంత్రం వరకే కుమార స్వామి సీఎం పోస్టులో ఉంటారని అనడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆస్తకికరంగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles