EC rejects Opposition demand to tweak VVPAT counting process బీజేపియేతర పార్టీల విన్నతిని తోసిపుచ్చిన ఈసీ

Election commission rejects opposition demand to tweak vvpat counting process

Election 2019, Lok Sabha election, Election Commission, EVM, VVPAT, Opposition, Sunil arora, chandrababu, gulamnabi azad, abhishek manu singhvi, 22 opposition parties, national politics

Leaders of 22 political parties had yesterday urged the Election Commission to ensure paper slips from the VVPAT module are matched before the counting begins so that in cases of discrepancy, all votes in that particular assembly segment can be cross-checked with the paper slips.

బీజేపియేతర పార్టీల విన్నతిని తోసిపుచ్చిన ఈసీ

Posted: 05/22/2019 03:07 PM IST
Election commission rejects opposition demand to tweak vvpat counting process

ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి విపక్షాలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల కమీషన్ కూడా కేంద్ర చేతిలో కీలుబోమ్మలా వ్యవహరిస్తోందన్నవిమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. తాజాగా సీఈసీ తీసుకున్న మరో నిర్ణయం కూడా వారి విమర్శలకు బలం చేకూర్చనుంది. దేశసర్వోన్నత న్యాయస్థానంలో తమిళనాడుకు చెందిన ఓ ఎన్జీఓ సంస్థ వీవీప్యాట్ లను స్లిపులను నూరుశాతం ఈవీఎంలతో సరిపోల్చాలని మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పిటీషన్ ను కోట్టివేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో దేశంలోని అన్ని బీజేపీయేతర రాజకీయ పక్షాలు కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలసి.. వీవీఫ్యాట్ స్లిపులను లెక్కించిన తరువాతే ఈవీఎంలను తెరవాలని కోరాయి. కాగా, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేసేది లేదని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆఘమేఘాల మీద సమావేశమైన సీఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మే 23న ఎన్నికల ఫలితాల సందర్భంగా మొదట వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఈనెల 21న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. అయితే, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పింది. దీంతో సునీల్ అరోరా నేతృత్వంలోని సీఈసీపై విపక్షాలు పెదవివిరుస్తున్నాయి. అధికార పక్షానికి తలొగ్గి కేంద్రఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప.. తమకు అనుకూలంగా కాదని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Election 2019  Lok Sabha election  Election Commission  EVM  VVPAT  Opposition  National politics  

Other Articles