Mulayam, Akhilesh get CBI clean chit in DA case ములాయం, అఖిలేష్ లకు సుప్రీంకోర్టులో ఊరట

Mulayam akhilesh yadav get cbi clean chit in disproportionate assets case

clean chit to Mulayam Singh,Prateek Yadav,Central Vigilance Commission,Akhilesh Yadav,Mulayam Singh,clean chit to Akhilesh Yadav,Samajwadi Party,sp,yadav disproportionate assets case,DA case, uttar pradesh, politics

The CBI has informed the Supreme Court that it gave a clean chit to Samajwadi Party patriarch Mulayam Singh and his son Akhilesh Yadav in a disproportionate assets case way back in August 2013 as the allegations against them could not be substantiated.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు: ములాయం, అఖిలేష్ లకు ఊరట

Posted: 05/21/2019 03:16 PM IST
Mulayam akhilesh yadav get cbi clean chit in disproportionate assets case

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌, ప్రస్తుత అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ లకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీరికి క్లీన్ చిట్‌ ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది. వారిపై 2013లో దాఖలు చేసిన కేసులో ఎలాంటి అధారాలు లేవని తేల్చిచెప్పింది. దీంతో తాము ఈ కేసును మూసివేస్తున్నట్లుగా కూడా చెప్పింది. ఈ మేరకు న్యాయస్థానానికి సీబిఐ తాజాగా సమర్పించిన అఫిడవిట్ లో పేర్కోంది.

ములాయం కుటుంబం అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడి.. ఆదాయానికి మించి ఆస్తులను సమకూర్చుకుందని గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్ చతుర్వేదీ 2005లో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2007 మార్చి 1న ములాయం, ఆయన కుమారులు అఖిలేశ్ యాదవ్‌, ప్రతీక్‌ యాదవ్‌, కోడలు డింపుల్‌ యాదవ్ లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత కేసు నుంచి డింపుల్‌ యాదవ్‌కు మినహాయింపు కల్పించింది.

అయితే ఇంతవరకు ఈ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవడంతో విశ్వనాథ్‌ ఇటీవల మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీబీఐపై ప్రశ్నల వర్షం కురిపించింది. ములాయం, అఖిలేశ్ పై కేసు ఏమైంది.. అసలు కేసు నమోదు చేశారా లేదా.. అని గట్టిగానే ప్రశ్నించింది. దర్యాప్తుపై తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో అఖిలేశ్‌, ములాయంపై రెగ్యులర్‌ కేసు నమోదు చేసేందుకు తమకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles