Congress' Roshan Baig calls KC Venugopal a 'buffoon' అధిష్టానంపై కాంగ్రెస్ నేత రోషన్ బేగ్ సంచలన వ్యాఖ్యలు

If congress loses dinesh gundurao siddaramaiah to blame roshan baig

Dinesh Gundu Rao, India, Karnataka, Karnataka Congress, Lok Sabha election, Lok Sabha polls, Roshan Baig, Siddaramaiah, karnataka, politics

Amid poor numbers given by exit polls to the Congress in the just-concluded Lok Sabha elections, senior Congress leader Roshan Baig dropped hints of quitting the party, and appealed to Muslims to compromise with the situation, if NDA returns to power.

అధిష్టానంపై కాంగ్రెస్ నేత రోషన్ బేగ్ సంచలన వ్యాఖ్యలు

Posted: 05/21/2019 02:43 PM IST
If congress loses dinesh gundurao siddaramaiah to blame roshan baig

మరోమారు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తాజాగా తేల్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాదని తేలడంతో గోడపై పిల్లిల మాదిరిగా వున్న నేతలు తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా వుందని చెప్పుకునే నేతలు ప్రతీ పర్యాయం అధికారానికి దూరంగా వున్న క్రమంలో తిరుగుబాటు చేయడం పరిపాటిగానే మారుతుంది.

తాజాగా కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ పార్టీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోకపోతే దానికి ఇద్దరు అగ్రనేతలే కారణమంటూ అరోపణలు చేశారు. దినేశ్ గుండూరావ్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలే కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి కారణమని బేగ్ మండిపడ్డారు. పరిస్థితులకు తగ్గట్టుగా మారాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ముస్లింలందరికీ విన్నవిస్తున్నానని... అవసరమైతే బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితులను బట్టి మనం కూడా మారాల్సి ఉంటుందని అన్నారు.

ముస్లింలు కేవలం ఒక్క పార్టీకే మద్దతుగా ఉండాల్సిన అవసరం లేదని బేగ్ అన్నారు. కర్ణాటకలో ఏం జరిగిందో అందరూ గమనించాలని... ముస్లింలకు కాంగ్రెస్ కేవలం ఒక్క టికెట్ మాత్రమే ఇచ్చిందని చెప్పారు. పరిస్థితిని బట్టి కాంగ్రెస్ ను వీడేందుకు కూడా తాను సిద్ధమేనని తెలిపారు. ముస్లింలు గౌరవంతో బతుకుతారని... తమ గౌరవానికి భంగం వాటిల్లిన చోట ఉండేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. తమను అభిమానించే వారి పక్కన కూర్చునేందుకు తాము సిద్ధమని తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా సరిగా నిర్వహించలేకపోయారని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dinesh Gundu Rao  Roshan Baig  Siddaramaiah  Karnataka Congress  Lok Sabha polls  karnataka  politics  

Other Articles