Top Court Rejects Request On Counting Of 100% VVPATs ‘‘వీవీఫ్యాట్ నూరుశాతం లెక్కింపు కుదరదు’’

Supreme court dismisses plea for vvpat verification of all evms

supreme court,vvpat,vote counting,Lok Sabha elections,lok sabha seats,lok sabha election 2019 date list,lok sabha elections,ls polls 2019,ls polls,ls polls survery,Lok Sabha polls,2019 general election,general election 2019,grand alliance,opposition parties,opposition alliance,political campaign,political parties,congress,bjp,narendra modi,amit shah,rahul gandhi,nda,NDA,UPA,prime ministerial candidate,mahagathbandhan,modi govt,prime minster candidate,political campaigns,political candidates,political parties,NYAY,NYAY scheme,Rs.72000,Congress nyay scheme,bjp’s sankalp patra,bjp sankalp patra,electoral expenditure,campaign rallies,Election Commission,ECI,EC,model code of conduct,EC regulations,voting,coalition,coalition politics

The Supreme Court turned down a request seeking 100 per cent matching of Voter Verifiable Paper Audit Trail (VVPAT) slips with Electronic Voting Machines (EVMs) during counting of votes on May 23.

వీవీఫ్యాట్ నూరుశాతం లెక్కింపు కుదరదు: సుప్రీం స్పష్టీకరణ

Posted: 05/21/2019 01:51 PM IST
Supreme court dismisses plea for vvpat verification of all evms

ఈవీఎంలలో నమోదైన ఓట్లతో.. వీవీప్యాట్‌ స్లిప్పులు నూరుశాతం సరిపోలేలా చూసిన తరువాతే ఓట్ల లెక్కింపు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది అనవసర పిటిషన్‌ అని, దీన్ని మేం విచారించబోమని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చెన్నైకు చెందిన టెక్‌ ఫర్‌ ఆల్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ దారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘ఈ వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే తీర్పు వెల్లడించిందని చెప్పిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం.. మళ్లీ ఎందుకు ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్‌ బెంచ్‌ ముందుకు పిటిషన్‌ తీసుకొచ్చారని ప్రశ్నించింది. దేశ ప్రధాన న్యాయమూర్తి తీర్పును మేం అధిగమించలేమని స్పష్టం చేసింది. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో మేం జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఇలాంటి అర్థం లేని పిటిషన్ ను విచారణకు ఎందుకు అనుమతించారని.. దీనిని తాము విచారించబోమని తేల్చిచెప్పింది.

దీంతో టెక్ ఫర్ ఆల్ అనే సంస్థ దాఖలు చేస్తున్న పిటీషన్ ను కొట్టివేస్తున్నామని ధర్మాసం వెల్లడించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా పరిగణనలోకి తీసుకునే వీవీప్యాట్‌ల సంఖ్యను కనీసం 50శాతానికి పెంచాలంటూ ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్‌లను లెక్కిస్తే సరిపోతుందంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VVPAT  EVM  Supreme Court  election results 2019  lok sabha election  vvpat slips  Politics  

Other Articles