Ravi Prakash changed 30 sim cards క్రిమినల్స్ కే క్రిమినల్ గా రవిప్రకాష్.. 12 రోజుల్లో 30 సిమ్ కార్డులు

Ravi prakash changed 30 sim cards calling only from whatsapp

Ravi Prakash, Shivaji, MKVN Murthy, Hari, MSN Murthy, vijayawada Advocate, data theft, fake shares purchase, national company law tribunal, Forgery Case, Cyberabad Cybercrime Police, Investigation, Evidences, Hyderabad, KCR, Telangana CM, Telangana, politics

The madhapur cyber crime police traced out that TV9 former CEO V Ravi Prakash, who is absconding from telangana police had changed nearly 30 sim cards from the movement police searches came into light.

క్రిమినల్స్ కే క్రిమినల్ గా రవిప్రకాష్.. 12 రోజుల్లో 30 సిమ్ కార్డులు

Posted: 05/21/2019 01:13 PM IST
Ravi prakash changed 30 sim cards calling only from whatsapp

సైబరాబాద్ పోలీసులు పెట్టిన పోర్జరీ, డాటా చోరి కేసులో తప్పించుకుని తిరుగుతున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌.. కేటుగాళ్లకు కేటుగాడిగా మారిపోయాడా.? ఆయన కోసం విసృత్తంగా గాలిస్తున్న పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఆయన అనుసరిస్తున్న మార్గాలు ఈ విషయాలనే స్పష్టం చేస్తున్నాయా.? క్రిమినల్స్ గురించి చెప్పి.. చెప్పి.. తన టీవీ9 చూపించి.. విసుగు తెప్పించిన రవిప్రకాష్ ఇప్పుడు అలాంటి క్రిమినల్స్ ను మించిపోయాడా..? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన ఏకంగా 30 సిమ్ కార్డులను మార్చినట్టు పోలీసులు గుర్తించారు.

టీవీ9 కార్యాలయంలో సోదాలు జరిగిన ఈ నెల 9వ తేదీ నుంచి ఇంతవరకూ ఆయన రోజుకు రెండు నుంచి మూడు సిమ్ లను మారుస్తూ వచ్చారని, పోలీసులు అంటున్నారు. సాంకేతికంగా తన జాడను బయట పెట్టకుండా ఉండేందుకు వైఫై ద్వారా వాట్స్ యాప్ కాల్స్ లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారని కూడా గుర్తించినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. డేటా చోరీ, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న రవిప్రకాశ్, పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ సైతం ఇంతవరకూ పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో, వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, తనపై దాఖలైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని, అయితే, తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. టీవీ9 వాటాల వివాదం ప్రస్తుతం విచారణలో ఉందని, అది పూర్తి కాకుండా, పోలీసులు కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నది రవిప్రకాశ్ వాదన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles