లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.. తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను చక్కగా వాడుకుని ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మనన్నలను కూడా అందుకుంటున్నారు. ఇప్పటికే తనకు తన పార్టీ అభిమానులకు మధ్య అడ్డుగా వున్న బ్యారికేడ్లను సైతం దూకి అభిమానుల గొంతు వినిపించుకున్నారు. వారిలో కొందరితో కరాచలనం చేసిన అమెను ఇందిరాగాంధీని మించిన నాయకురాలిగా అభివర్ణిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.
అలాంటి నాయకురాలికి చేధు అనుభవం కల్పించాలని బీజేపి కార్యకర్తలు భావించారు. అయితే దానిని కూడా అమె తనకు అనుకూలంగా మార్చుకుని హుందాగా నడుచుకోవడంతో.. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు కూడా అమె చతురత ముందు సలామ్ చేయక తప్పలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఇండోర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంకా గాంధీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళుతున్నారు. దీంతో ఆమె కాన్వాయ్ వెళ్లే మార్గంలో కొందరు బీజేపీ కార్యకర్తలు గుమిగూడారు. ప్రియాంక అటుగా రాగానే ‘మోదీ.. మోదీ.. మోదీ’ అని నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
దీన్ని గమనించిన ప్రియాంక సెక్యూరిటీ సిబ్బంది సాయంతో కారు దిగారు. అనంతరం వారి వద్దకు చిరుమంద హాసంతో నేరుగా వెళ్లిన ప్రియాంక గాంధీ.. వారితో కరాచలనం చేశారు. అమె తమ వద్దకు వస్తుండటంతో కొంత అందోళనకు గురైన బీజేపి కార్యకర్తలు.. అమె నవ్వుతూ తమ చెంతకు వస్తుండటం గమనించి గుండె నిబ్బరం చేసుకున్నారు. ఇక మరో అడుగులో తమ చెంతకు చేరుకుంటారన్న తరుణంలో అమె బీజేపి కార్యకర్తలతో కరాచలనం కోసం చేయి చాచారు. దీంతో వారు అమెతో కరాచలనం చేశారు. ఇలా ప్రత్యర్థి పార్టీల నేతలను కూడా అమె ప్రభావితం చేశారు.
దీంతో సడన్ గా కాన్వాయ్ నుంచి దిగి మోడీ మద్దతుదారుల దగ్గరకు వెళ్లి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన ప్రియాంక.. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి..నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉంటా అంటూ వారికి ప్రియాంక ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇలా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను కూడా తమ వైపుకు మళ్లించుకునే సత్తా వున్న నాయకురాలిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమెను కొనియాడుతున్నారు. ఇంధిరాగాంధీలోని నాయకత్వ లక్షణాలు, ప్రత్యర్థులను చిత్తు చేయగల రాజకీయ చతురత అమెలో పుష్కలంగా వున్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
The Magnanimous @priyankagandhi
— Zainab Sikander (@zainabsikander) May 13, 2019
Watch what happens when people shout "Modi Modi" at her convoy.pic.twitter.com/R9bn7Aa4v1
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more