Andhra Pradesh 10th Board Result Out ఏపీ 10 క్లాస్ ఫలితాల్లో టాప్ లేపిన బాలికలు

Andhra pradesh 10th board result out 94 88 percentage pass

APBSE,Board Result,Board result 2019,Andhra Pradesh ssc result,Andhra Pradesh ssc result 2019,Andhra Pradesh 10th result,Andhra Pradesh 10th result 2019,ts 10th result,ts 10th result 2019,ts ssc result,ts ssc result 2019, politics

Andhra Pradesh SSC result 2019 has been released. AP 10th result was announced by School Education Commissioner Sandhya Rani. SSC results has noted 94.88 pass percentage.

ITEMVIDEOS: అంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల్లో 94.88శాతం ఉత్తీర్ణత..

Posted: 05/14/2019 12:07 PM IST
Andhra pradesh 10th board result out 94 88 percentage pass

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 94.88గా ఉండగా ఇందులో అమ్మాయిల శాతం 95.09గా ఉంది. బాలుర శాతం 94.68గా ఉందని ప్రకటించారు. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా టెన్త్ ఫలితాలలో బాలికలదే పైచేయి అని ఆమె ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 98.19 శాతం ఉత్తీర్ణత రాగా అత్యల్పంగా నెల్లూరులో 83.19 శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు ఆమె తెలిపారు.

మొత్తం 6,30,082 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని వారిలో పదివేల 588 మంది ప్రైవేటు విద్యార్థులని చెప్పారు. 11వేల 690 స్కూళ్లకు గాను 5వేల 464 స్కూళ్లు 46.47 శాతం పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె తెలిపారు. గత ఏడాది 17 పాఠశాలలో సున్నాశాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సారి కేవలం 3 స్కూళ్లల్లో 0 శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు ఆమె తెలిపారు. వీటిలో రెండు ప్రైవేటు పాఠశాలలు వుండగా, ఒకటి ఎయిడెడ్ స్కూల్ వుందని అమె తెలిపారు.

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు మే-30,2019 లోపల సబ్జెక్టు వారీగా రూ.500 ఫీజును చలానా లేదా ఆన్ లైన్ పేమెంట్ చెల్లించాలని ఆమె తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.అభ్యర్ధులు ఫలితాలను www. bseap.org, rtgs.ap.gov.in లో తెలుసుకోవచ్చు

- గవర్న‌మెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.24 శాతంతో రెండో స్థానంలో ఉంది.
- బిసి సంక్షేమ పాఠశాలల్లో 98.14శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది
- ఎయిడెడ్ పాఠశాలలో అత్యల్పంగా 87.16 శాతం ఉత్తీర్ణత
- ప్రైవేటు పాఠశాలలో 98.09శాతం ఉత్తీర్ణత
- మోడల్ స్కూళ్లలో 97.17 శాతం పాస్
- కేజీవిబి పాఠశాలల్లో 95.66 శాతం ఉత్తీర్ణత
- 11వేల 690 స్కూళ్లకు గాను 5వేల 464 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు
- నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన వాటిలో 2351 ప్రభుత్వ పాఠశాలలు, 3113 ప్రైవేటు పాఠశాలలు
- ఆంగ్లం మాద్యమంలో 97.54శాతం ఉత్తీర్ణత సాధించగా, తెలుగులో 90.46శాతం ఉత్తీర్ణత
* రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కొరకు మే-30 చివరి తేదీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles