Yadadri Temple to distribute Jaggery Laddu Prasadam ప్రసాదంలోనూ ప్రత్యేకతకు యాదాద్రి ఆలయం ప్రయత్నం..

Jaggery laddu to be the speciality of yadadri laxminarasimha swamy temple

Telangana government, endowments department, laddu prasadam, jaggery, Yadadri Lakshmi Narasimha Swamy Temple, Telangana

Telangana endowments ministry to bring a change in Yadadri Lakshmi Narasimha Swamy Temple Prasadam, to replace sugar with jaggery and prepare Laddu Prasadam. The commitee observed the process and given a report to the Endowment department.

ప్రసాదంలోనూ ప్రత్యేకతకు యాదాద్రి ఆలయం ప్రయత్నం..

Posted: 05/10/2019 04:43 PM IST
Jaggery laddu to be the speciality of yadadri laxminarasimha swamy temple

భారత దేశంలోని ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత వుంటుంది. అది ఆలయంలో వెలసిన స్వయంభూ దేవతల విషయంలోనే కాదు.. ఆలయ ఏర్పాటు, ఆలయ స్థానంబలం, పురాణ ఐతిహ్యంలకు సంబంధించి కూడా ప్రత్యేకలు వుంటాయి. వీటన్నింటినీ మనకు ఆయా ఆలయాల స్థలపురాణలు తెలుసుకునే క్రమంలో తెలుస్తాయి. ఇంతేకాదు.. ఆలయాలలో అందించే ప్రసాదాలకు కూడా ప్రత్యేకతలు, విశిష్టతలు వుంటాయి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పగానే మనకు నేతితో చేసిన లడ్డూలు గుర్తుకు వచ్చి నోరూరిస్తాయి.

యాలకులు, బాదం, కిస్ మిస్, ఇలా చాలా డ్రై ఫూట్స్ తో మేలవితమైన ఎంతో రుచికరమైన ప్రసాదం అంటే శ్రీవారిదే. ఇక అన్నవరం సత్యదేవర ఆలయంలో ప్రసాదానికి మరో ప్రత్యేకత వుంటుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ప్రసాదం విషయంలోనూ ప్రత్యేకత చాటాలని దేవాదాయ శాఖ భావిస్తుంది. యాదాద్రి పేరు చెబితే ఆలయంలోని స్వామి అమ్మవార్లతో పాటు ఇక్కడి ప్రసాదం కూడా భక్తులకు గుర్తకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా భక్తులకు బెల్లం లడ్డూలు అందిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు చేస్తున్నారు.

బెల్లం లడ్డూ తయారీ ప్రక్రియపై కసరత్తు మొదలు పెట్టారు. ఈ లడ్డూల తయారికీ ఏయే వస్తువులు అవసరం.. అన్న విషయమై ఓ కమిటీని కూడా వేశారు. ఈ కమిటీలో ఆలయ ఈఓ ఐదుగురు ఏఈఓలు, ఇద్దరు ప్రధాన పూజారులు, ఇద్దరు వంట స్వాములు, ఇద్దరు పర్యవేక్షకులు కలిపి మొత్తం 11 మంది ఉద్యోగులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రయోగాత్మకంగా బెల్లం లడ్డూ తయారు చేపట్టింది. వంద గ్రాముల బరువున్న లడ్డూ తయారీకి వాడిన వివరాలతో కూడిన నివేదికను ఆలయ ఈవోకు అందజేసింది. ఈ నివేదికను ఈఓ దేవాదాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తారు. అటు నుంచి వచ్చే అనుమతుల మేరకు లడ్డూ తయారీపై నిర్ణయం తీసుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles