Girl Gangraped in Front of Male Friend in Mysore ప్రియుడి కళ్లెదుటే యువతిపై గ్యాంగ్ రేప్

Girl allegedly gangraped in front of boyfriend in mysore

Mysore, Crime, Gang rape, Sexual assault, rape, rape in India, rape in Mysore, Mysore, sexual assault, sexual harassment, Lingambudhi Palya,girl raped, Mysore girl raped, Mysuru gang rape, Crime

In a ghastly incident which has come to light from Mysuru in Karnataka, a girl was gang-raped in Lingambudhi Palya, of Mysore. The accused dragged the victim away from the main road to a secluded place where they sexually assaulted her. while she was returning back to home after work.

ప్రియుడి కళ్లెదుటే యువతిపై సామూహిక అత్యాచారం..

Posted: 05/10/2019 03:56 PM IST
Girl allegedly gangraped in front of boyfriend in mysore

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆరుగురు కామాంధులు ప్రియుడి ఎదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మైసూరు నగర శివార్లలోని లింగాంబుధి చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్న ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమలో వున్నారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం లాడ్జీలో విధులు ముగించుకున్న తరువాత వీరిద్దరూ లింగాంబుధి చెరువు వద్దకు కబుర్లు చెప్పుకొనేందుకు వెళ్లారు.

అదే సమయంలో మద్యం మత్తులో వున్న ఆరుగురు యువకులు కారులో అక్కడికి చేరుకున్నారు. యువతిని చెరువుకు వెళ్లే దారి నుంచి  కిందకు లాగిన యువకులు అమెను నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి అమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. అడ్డుకునేందుకు యత్నించిన అమె ప్రియుడ్ని కామాంధులు తాళ్లతో చెట్టుకు కట్టేసి బండరాయితో అతని తలపై మోది.. యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అఘాయిత్యానికి తెగబడిన తరువాత వారు అక్కడి నుంచి పారిపోయారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోంది.

దీంతో కేసు నమోదు చేసుకున్న జయపుర పోలీసులు.. బాధితులకు చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. కాగా వారిద్దిరి పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు. అయితే నిందితుల్ని గుర్తుపట్టడం కాస్త కష్టంతో కూడుకున్న పనేనని, ఎందుకుంటే అక్కడ పూర్తిగా చీకటి అలుముకుందని.. వారి ముఖ్యాలను గుర్తుపట్టేంత వెలుతురు కూడా లేదని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో ఘటనాస్థలంలో ఆ రాత్రి ఎవెరెవరు వున్నారన్న సమాచారం కోసం పోలీసులు మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం డేటాను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఎనమిది పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  sexual assault  Lingambudhi Palya  boy friend  mysuru  mysore  karnataka  crime  

Other Articles

Today on Telugu Wishesh