Shopkeeper quizzes BJP's poll promises బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు పరాభవం..

Shopkeeper quizzes anupam kher on bjp s 2014 poll promises

anupam kher, kirron kher, chandigarh, bharatiya janata party, bjp, election, poll promise, manifesto, lok sabha elections 2014, politics

When the veteran actor Anupam Kher approached a shopkeeper, the man produced the BJP's 2014 manifesto and asked him how many of the promises had been fulfilled in the last 5 years

ITEMVIDEOS: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు పరాభవం..బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు పరాభవం..

Posted: 05/08/2019 08:13 PM IST
Shopkeeper quizzes anupam kher on bjp s 2014 poll promises

బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సరిగ్గా రెండు రోజుల క్రితం జనాలు లేక ఆయన సభ రద్దయింది. అయితే తాను ఇప్పటి వరకు 515 చిత్రాల్లో నటించానని, కానీ అన్ని హిట్ కాలేదని తనని తాను సమర్థించుకున్నారు. ఈ విషయంలో ఇంకా ఓ వైపు విపక్షాల విమర్శలను ఎదుర్కోంటున్న సందర్భంలోనే ఆయనకు మరో షాక్ తగిలింది. దీంతో ఆయన ముఖం ఎర్రబడింది.

అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ చండీగఢ్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో, ఆమె తరపున అనుపమ్ ఖేర్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన ఒక దుకాణంలోకి వెళ్లారు. బీజేపీకి ఓటు వేయాలని దుకాణం యజమానిని కోరారు. ఎవరైనా నేత తమ దుకాణాకి వస్తే.. మనకు ఇష్టం వున్నా.. లేకపోయినా ముఖమాటానికి అలాగేనండీ అంటూ ముక్తసరి కోసమైనా తలవూపుతాం. కానీ ఈ దుకాణం యజమాని ఇచ్చిన షాక్ కు ఖేర్ తెల్లముఖం వేశాడు.

ఇంతకీ ఏం చేశాడంటారా..? అనుపమ్ ఖేర్ తన భార్యకు ఓటు వేయాలని కోరడంతోనే దుకాణం యజమాని ఆయనకు నమస్కరించి.. ప్రశ్నల వర్షం కురిపించాడు. బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి? మీకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించాడు. అంతేకాదు 2014లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను భద్రంగా దాచుకున్న ఆయన దానిని అనుపమ్ ఖేర్ కు చూపించి... వీటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ నిలదీశాడు. అంతే అంతపెద్ద నటుడైనా.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించినా.. దుకాణాదారుడు అడిగిన ప్రశ్నలకు బదులివ్వలేక మెల్లిగా అక్కడి నుంచి బయటకు వచ్చి వేరే దుకాణంలోకి వెళ్లాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh