'Live-in Relation in India Like Marriage,' Rules HC సహజీవనం విషయంలో రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

Live in relation in india like marriage rules rajasthan high court

'Live-in Relation in India Like Marriage,' Live in relationship, marriage, Rajasthan High Court, Indian society, Justice Sanjeev Prakash Sharma

Rajasthan High Court has restrained a man from getting married following a petition filed by his live-in partner. Justice Sanjeev Prakash Sharma said, “Live-in relationship in Indian society amounts to marriage and the society recognises it only as a marriage and not in any other form.

"సహజీవనం పెళ్లితో సమానమే" రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

Posted: 05/08/2019 07:23 PM IST
Live in relation in india like marriage rules rajasthan high court

ఓ మహిళతో కొన్నాళ్లపాటు సహజీవనం చేసి, ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నించిన వ్యక్తికి రాజస్థాన్ హైకోర్టు షాకిచ్చింది. భారతీయ సమాజంలో సహజీవనం చేయడమంటే పెళ్లి చేసుకున్నట్టుగానే పరిగణించాలని అభిప్రాయపడింది. అంతే తప్ప మరోలా భావించడంలో అర్థం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో యువతితో నిందితుడు పెళ్లి చేసుకోవడానికి అనుమతిని ఇవ్వలేదు. దీంతో బాధితురాలి భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఈ మేరకు న్యాయస్థానం నిందితుడు బలరామ్ తో పాటు.. ఆతను వివాహం చేసుకుందామనుకున్న యువతికి కూడా నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు రాజస్థాన్ హోం శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ, ఝున్ ఝును జిల్లా కలెక్టర్ కూడా కూడా తాఖీదులను పంపింది. బాధితురాలై ఓ వివాహిత పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న వివాహితతో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బలరాంకు స్నేహం కుదిరింది.

వారి పరిచయం పరిణయానికి దారి తీసింది. అయితే తాను వివాహితను అన్న విషయాన్ని మర్చిపోయిన అమె.. బలరాం తనకు ఇచ్చిన హామీ మేరకు వివాహమాడుతాడని విశ్వసించింది. అంతే తన సర్వస్వాన్ని అందించింది. అంతేకాదు పెళ్లాడతానని బలరాం మాటివ్వడంతో తన భర్తకు విడాకులు కూడా ఇచ్చేసింది. ఇక తన పూర్తి జీవితం బలరామే అని నమ్మింది. అయితే, ఇటీవల బలరాంకు ఐటీలో మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో అతని హోదాలో, జీతం, జీవితంలో కొత్తదనం వచ్చి చేరింది.

అన్ని కొత్తగా సమకూరుతున్న సమయంలో పాత వివాహిత ఎందుకు అనుకున్నాడో ఏమో.. ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాల్సిన అవసరమేంటి అని కూడా భావించాడు. అమెతో దూరంగా జరిగాడు. అమె ఫోన్ కు కూడా బదులివ్వడం మానేశాడు. ఎదో తెడా వస్తుందని భావించిన భాదితురాలు.. కూపీ లాగడంతో బలరాం మరో అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడన్న విషయం తెలిసింది. దీంతో అమె పోలీసులను ఆశ్రయించింది. సదర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 6 నమోదైన కేసు విచారణకు రావడంతో హైకోర్టు.. సహజీవనం చేయడమంటే పెళ్లాడినట్టేనని సంచలన తీర్పు వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles