oil prices may rise after lok sabha elections మరో పది రోజుల్లో గెండెగుబేలు.. పెరగనున్న పెట్రోధరలు..

Petrol and diesel prices may rise after lok sabha elections

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, IOC, OMC, oil companies, gst, petrol price, diesel price, Lok Sabha Elections

Fuel prices have been on a constant in view of General elections 2019, just in the case of karnataka and five state elections. But it may rise very high after may 19 says analysts, due to the scenario taken place in the international market.

మరో పది రోజుల్లో గెండెగుబేలు.. పెరగనున్న పెట్రోధరలు..

Posted: 05/08/2019 12:45 PM IST
Petrol and diesel prices may rise after lok sabha elections

దేశంలో ఇంధన ధరలు కొన్ని నెలల నుంచి ఎందుకు స్థిరంగా ఉన్నాయి. తుఫాను మందు ప్రశాంతతను తలపిస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఇంధన ధరలు కాస్త అటుఇటుగా స్థిరంగా వున్నాయి. మార్చి 10కి ముందు రెండు నెలలతో పోలిస్తే 1 శాతం కంటే తక్కువగా పెట్రోల్ ధరలు పెరిగాయి. అయితే వాహనదారులపై కేంద్రప్రభుత్వానికి ఇంత ప్రేమను ఎందుకు కనబరుస్తుందా.? అన్న అలోచనలో మీరు పడలేదని తెలుసు.

ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల పోలింగ్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇంధన ధరలు పెంచితే దాని ప్రభావం కూడా ఓట్లపై పడుతుందని కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం భావించింది. దీంతో అంతర్జాతీయంగా ధరల ప్రభావం ఎలా వున్నా.. దేశీయంగా మాత్రం ధరలు స్థిరంగానే వుండేట్లు చూసుకునేలా చర్యలను చేపట్టింది. దీంతో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి నుంచి పెట్రోల్ ధరలు సుమారుగా 3.5 శాతం మాత్రమే పెరిగాయి.

కేంద్రంలో బీజేని నేతృత్వంలోని ఏన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన క్రమంలో అప్పటివరకు నెలకు రెండు పర్యాయాలుగా మారే ఇంధన ధరలను.. అంతర్జాతీయ మార్కెట్ ధరలతో రోజూవారీగా మారుతువుండటం ప్రారంభంమైంది. లోక్ సభ ఎన్నికల వేళ ఇంధన ధరలు స్థిరంగా ఉండిపోవడంతో వినియోగదారులకు కాస్త రిలీఫ్ దొరికినట్టుయింది. ఇంధన ధరల పెంపు ఆలస్యం కావడంతో ఆయిల్ కంపెనీలు ఎన్నికలు అయ్యేవరకు ఓపిగ్గా ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ముందు వరకు రోజువారీ పెంపుతో వినియోగదారుల నడ్డివిరిచిన ఆయిల్ కంపెనీలు మే 19 కోసం ఎదురుచూస్తున్నాయి.

లోక్ సభ చివరి దశ ఎన్నికలు మే 19తో ముగియనున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఇన్నాళ్లు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయిల్ కంపెనీలు ప్రెటో బాంబును ఎంతలా పేల్చుతారోనన్న అందోళన వాహనదారుల్లో నెలకోంది. ఎన్నికల సమయంలో స్థిరమైన ఇంధన ధరలతో రిలీఫ్ గా ఉన్న వినియోగదారుడు.. రెండు చివరి దశలకు పోలింగ్ కు సమయం సమీపిస్తున్న క్రమంలో ధరల మోత మోగనుందని తెలిసి కంగారుపడుతున్నాడు.

ఇంధన ధరల పెంపుపై ఆయిల్ కంపెనీలు ఆలస్యం చేయడానికి లోక్ సభ ఎన్నికలే కారణమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ సొంత పాలసీతో రోజువారీ ధరల పెంపు పాలసీని ఉల్లంఘించినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉండేలా ఆయిల్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం సూచించడం వల్లే ధరలను రివైజ్ చేయలేదని మండిపడింది. ఎన్నికలు ముగిసిన అనంతరం భారీగా పెరిగే ఇంధన పన్నులను ప్రభుత్వం తగ్గించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అఖిలేష్ ప్రతాప్ సింగ్ డిమాండ్ చేశారు. ఇంధన పన్ను తగ్గించకపోతే.. వినియోగదారులు అధిక మొత్తంలో ఇంధన ధరలను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oil price  crude oil  price hike  petrol  diesel  IOC  OMC  oil companies  Lok Sabha Elections  

Other Articles