IT Raids on Dil Raju's premises దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

It raids at dil raju house day before maharshi release

IT raid dil raju office maharshi release, dil raju office it raid, mahesh babu maharshi it raid, mahesh babu, maharshi, it raid mahesh producer house, maharshi movie, Dil Raju, IT Raids, Maharshi, Maharshi producer, mahesh babu, tollywood

Maharshi producers got a shock a day before the release of the movie. The movie is all set to hit theatres tomorrow. As per reports coming in, the Income Tax sleuths have knocked on the doors of Dil Raju's office. Dil Raju is the producer of Maharshi.

దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

Posted: 05/08/2019 01:37 PM IST
It raids at dil raju house day before maharshi release

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు కు ఆదాయపన్నుశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన నిర్మిస్తున్న మహర్షి చిత్రం విడుదలకు కొన్ని గంటల వ్యవధి ముందు దాడులు చేసిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటితో పాటు కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే  బృందాలుగా విడిపోయిన అధికారులు ఇంటితో పాటు ఆఫీసులను రికార్డులను పరిశీలిస్తున్నారు.

సాగర్ సొసైటీలోని దిల్ రాజు ఆఫీస్ లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 5 బృందాలుగా ఐటీ అధికారుల రంగంలోకి దిగి ఇళ్లు, కార్యాలయాలపైన సోదాలు నిర్వహిస్తున్నాయి. అనూహ్యంగా దిల్ రాజు ఆఫీస్ లో ఐటీ సోదాలు జరగడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షికి సినిమాకు దిల్ రాజు సహ-నిర్మాతగా వ్యవహరించారు.

దీంతో ఈ సినిమా బడ్జెట్‌, బిజినెస్‌, కలెక్షన్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఎఫ్2 సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో గతంలో చెల్లించిన పన్ను, కలెక్షన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమాకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  IT Raids  Maharshi  Maharshi producer  mahesh babu  tollywood  

Other Articles