Inter student dies after suicide bid 20 రోజులుగా చికిత్సపోందుతూ.. మరో ఇంటర్ విద్యార్థిని మృతి..

Another inter student dies family demands action against officials

manasa, treatment, Inter student, Suicide, Bhadradri Kothagudem district, mpc first year, crime, Telangana, politics

Twenty days after consuming pesticide, an 17-year-old Saila Manasa, a first year intermediate student from Vengannapalem village of Julurpad mandal, studying in a private college in Khammam, consumed a pesticide after she failed in four subjects.

20 రోజులుగా చికిత్సపోందుతూ.. మరో ఇంటర్ విద్యార్థిని మృతి..

Posted: 05/08/2019 11:52 AM IST
Another inter student dies family demands action against officials

తెలంగాణ ఇంటర్ ఫలితాలలో చోటుచేసుకున్న అవకతవకలను సరిచేస్తామని చెప్పిన బోర్డు.. ఇప్పటికీ తమ నిర్ణయాన్ని వెల్లడించని కారణం చేత విద్యార్థుల మరణాలు కూడా ఆగడం లేదు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిర్లక్ష్యానికి మరో విద్యార్థిని బలైంది. తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 25 మంది విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్షధోరణితో బలవన్మరణాలకు పాల్పడగా, ఇవాళ మరో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కూడా పరమపదించింది. అధికారుల తప్పిదాలకు విద్యార్థులు.. తమ అమూల్యమూన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తుండడం.. రాష్ట్రంలో సంచలనంగా మారింది.

ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో ఈ విషాదం జరిగింది. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల రమేష్, సునీత దంపతుల పెద్ద కుమార్తె సాయిల మానస(17) ఇంటర్‌ ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలో చదువుతోంది. మెరిట్ స్టూడెంట్ అయిన మానస.. ఏప్రిల్ 18న వచ్చిన ఇంటర్‌ ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో మానస ఫెయిలైంది.

10వ తరగతిలో 8 జీపీఏ గ్రేడ్‌ సాధించి గ్రామస్థుల నుంచి అభినందనలు అందుకున్న అమె.. తాను ఇంటర్ మొదటి సంవత్సరంలో నాలుగు సబెక్టులు తప్పానని తెలిసి.. దానిని జీర్ణంచుకోలేక మానసిక అందోళనకు గురైంది. తాను ఫెయిల్‌ కావడం తట్టుకోలేకపోయిన అమె. అదే రోజు రాత్రి ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందు తాగింది. వెంటనే తల్లిదండ్రులు మానసని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ఐదు రోజులపాటు వైద్యులు చికిత్స అందించారు. లాభం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ లోని సూపర్‌ స్పెషల్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. 20 రోజుల నుంచి చికిత్స పొందుతున్న మానస ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె తమకు దూరమైందని తల్లిదండ్రులు విలపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles