voters posted secret ballot voting on social media సోషల్ మీడియాలో ‘పరిషత్’ ఓటింగ్ దృశ్యాలు

Election officials negligence voters posted secret ballot voting on social media

Voting Visuals Posting, Social Media, Election Officials Negligence, Parishat elections, Burgampad, voting visuals, mobile phone, shooting, zptc, mptc elections, Khammam, Telangana, Politics

Due to Election Officials Negligence voters posted their parishat voting visuals in social media at Burgampad of Khammam district. In Telangana Ist phase of parishad elections are taking place today.

ITEMVIDEOS: ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం.. సోషల్ మీడియాలో ఓటింగ్ దృశ్యాలు

Posted: 05/06/2019 04:12 PM IST
Election officials negligence voters posted secret ballot voting on social media

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న మన దేశంలో.. ఓటు అనేది రహస్య బ్యాలెట్. ప్రచారం ఎవరు ఎవరికీ చేసుకున్నా.. ఓటు వేయడం మాత్రం ఎవరు ఎవరికి వేస్తున్నారో కూడా తెలియకూదన్న నిబంధనలు వున్నాయి. కానీ అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవంతో యువ ఓటర్లు తమ ఓట్లను సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటున్నారు. అంతేకాదు.. తాము ఏ పార్టీకి ఓటు వేశామన్నది కూడా స్పష్టంగా కనిపించేలా వీడియోలు తీసీ సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపుతోంది.

ఖమ్మం జిల్లా బూర్గంపాడులో పరిషత్ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన వెలుగుచూసింది. పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు అనుమతించకూడదన్న నిబంధలన వున్నా అధికారులు ఆ నిబంధనలకు నీళ్లు వదిలేయడంతో. కొందరు ఓటర్లు తాము ఓటు వేసిన దృశ్యాలను మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఇంకేముందీ.. తాము తీసిన వీడియోలను వాట్సాప్, ఫేస్ బుక్ లో షేర్ కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం దుమారం రేపింది. దీంతో వారు ఏ పార్టీకి ఓటు వేశారో, ఏ గుర్తుకి ఓటు వేశారో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. టీఆర్ఎస్ గుర్తుకి ఒకరు, కాంగ్రెస్ గుర్తుకి మరొకరు ఓటు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదు. ఓటు ఎవరికి వేశామన్నది రహస్యంగా ఉంచాలి. ఓటు వేయడాన్ని షూట్ చెయ్యడం కానీ, ఫొటోలు తియ్యడం కానీ చెయ్యరాదు. బూర్గంపాడు పోలింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధమైన పనులు జరుగుతున్నా.. ఎన్నికల అధికారులు మౌనంగా ఉండటం విమర్శలకు తావిచ్చింది. ఎన్నికలు అధికారుల తీరుపై పార్టీల నాయకులు, అభ్యర్థులు మండిపడ్డారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు సోమవారం (మే 6,219) పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 197 జెడ్పీటీసీ.. 2వేల166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 69 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2వేల 097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ స్థానాలకు 7వేల 72మంది, జెడ్పీటీసీ స్థానాలకు 882మంది పోటీ పడుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 197 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles