CBSE Class 10th Result 2019 DECLARED సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల్లో 91.1 శాతం ఉత్తీర్ణత..

Cbse class 10th result 2019 declared 91 1 pass percentage

CBSE 10th result 2019, cbse class 10 result date, cbse.nic.in, cbseresults.nic.in, cbse board 10th result 2019, cbse Class 10th result 2019, board result 2019 10th out, cbse result 2019, cbse board result 2010 , cbse board result, cbse topper, cbse topper 2019, cbse class 10th topper, cbse class 10 topper, cbse result topper, cbse result 2019 topper, cbse results, india today, cbse result live, cbse 10th result live, cbse class 10 th result live, class 10th result cbse, results.nic.in, CBSE Class 10 Board Result 2019, CBSE Class 10th board results, CBSE 10th Board Results 2019, cbse 10th result via sms, cbse 10th result via digilocker, cbse class 10 th result via app, cbse class 10 result on google, CBSE Class 10 2019

The Central Board of Secondary Education (CBSE) has released CBSE Class 10th Result 2019 or CBSE 10th result or CBSE Board result 2019 today on its official website.

సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల్లో 91.1 శాతం ఉత్తీర్ణత.. అమ్మాయిలే టాప్..

Posted: 05/06/2019 03:24 PM IST
Cbse class 10th result 2019 declared 91 1 pass percentage

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను బోర్డు అధికారులు ఇవాళ విడుదలచేశారు. గత ఏడాది కన్నా ఈ సారి ఉత్తర్ణీత శాతం పెరిగింది. గత ఏడాది కన్నా ఏకంగా 4.4శాతం ఉత్తర్ణత పెరిగింది. ఏకంగా 13 మంది విద్యార్థులు 499 మార్కులను సాధించారు. అయితే వీరిలో 8 మంది ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారే కావడం గమనార్షం. మిగిలిన వారిలో ఇద్దరు రాజస్థాన్, హర్యానా, పంజాబ్, కేరళ నుంచి ఒక్కో విద్యార్ధి టాపర్ గా నిలిచారు. ఇక 498 మార్కులను సాధించిన విద్యార్థులు 25 మంది వున్నారు.

ఈసారి పదో తరగతి పరీక్షల్లో 57 వేల 256 మంది విద్యార్థులు 95శాతానికి పైగా మార్కులను సాధించారు. గత ఏడాది 86.7 ఉత్తీర్ణ శాతం నమోదు కాగా, ఈ సారి 91.1 ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా ఈ సారి కూడా త్రివేండ్రమ్ విద్యార్థులే మరోమారు సత్తా చాటి తమ అగ్రస్థానాన్ని మరోమారు నిలబెట్టకున్నారు. విద్యార్థులు www.cbseresults.nic.in లేదా www.cbse.nic.in అనే వెబ్‌సైట్‌లలో తమ ఫలితాలు చూసుకోవచ్చని సీబీఎస్‌ఈ ప్రకటించింది.

ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 18,27,472 మంది విద్యార్థులకు హాజరయ్యారు. వీరిలో ఏకంగా 5.69.695 మంది విద్యార్థులు ఒక్క దేశరాజధాని ఢిల్లీ నుంచే వుండటం గమనార్హం. ప్రతీ ఏడూ పరీక్షా ఫలితాలను త్వరగా వెల్లడించే ఐసీఎస్ఈ బోర్డు కన్నా ముందుగానే ఈసారి సీబీఎస్ఈ బోర్డు తమ ఫలితాలను వెల్లడించింది. సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో ఉత్తర్ ప్రదేశ్ నోయిడాకు చెందిన సిద్దాంత్ పెన్ గోరియా, దివ్యాంశ్ వాద్వా టాపర్స్ గా నిలిచారు.

ఈ ఏడాది తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర బోర్డుల కంటే ముందే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను వెల్లడించింది. సీబీఎస్ఈ పదో తరగతి-2019 ఫలితాలను ఇతర వెబ్‌సైట్లు అయిన examresults.in, indiaresults.com, results.gov.inలోనూ చెక్ చేసుకోవచ్చు. కాగా, ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోగా 1800 11 8004 నంబరును సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా, ఫలితాల డిజిటల్ సర్టిఫికెట్లను www.digilocker.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలు చెక్ చేసుకోండిలా..
www.cbseresults.nic.in లేదా www.cbse.nic.in సైట్‌ను ఓపెన్ చేయండి
హోం పేజీలోకి వెళ్లి  ‘క్లాస్ 10 రిజల్ట్స్ 2019’ పై క్లిక్ చేయండి
మీ రిజిస్ట్రేషన్ నంబరు లేదా రూల్ నంబరును, ఇతర వివరాలను ఎంటర్ చేయండి
ఫలితాలు స్క్రీన్‌పై చూపించాక, డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBSE  10th result 2019  cbse.nic.in  cbse result topper  pass percentage  trivandrum  

Other Articles