New data agency to process re-verification : BIE అగ్గిరాజేసేలా ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వ్యాఖ్యలు..

New data agency to process re verification says bie secretary ashok

students union protest inter board, students arrest intermIediate board, security intermiediate board, parents agitation intermiediate board, three level security at inter board, poonam kaur panic on students sucides, Telangana CM, KCR, Intermiediate results, KTR, interboard failure, Telangana, politics

On the orders of the Board, the agency started Re-Verification/Re-Correction process from April 24 and would declare the results within May 10, Board Secretary Ashok Kumar said.

అగ్గిరాజేసేలా ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వ్యాఖ్యలు..

Posted: 05/06/2019 01:54 PM IST
New data agency to process re verification says bie secretary ashok

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మార్కుల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయపార్టీలో అన్ని తమ అందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్ ఫలితాలతో తమ మార్కులపై విస్మయానికి గురైన రాష్ట్రంలోని 25 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ  క్రమంలో దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని అశోక్ చెబుతున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థుల మార్కుల విషయంలో ఎలాంటి పొరబాట్లు జరగలేదని స్పష్టం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల పేపర్లను రీవెరిఫికేషన్ చేశామని ఆయన వెల్లడించారు. ఒక విద్యార్థినికి 85 శాతం మార్కులు వచ్చినా ఆత్మహత్య చేసుకుందని, మరో విద్యార్థిని అన్ని సబ్జెక్టులు పాసైనా బలవన్మరణం చెందిందని వివరించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనేది వాస్తవం కాదని అశోక్ అభిప్రాయపడ్డారు.

రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తదితర ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఆ ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత జవాబు పత్రాలను అందుబాటులో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా అన్ని చర్యలు తీసుకున్నాకే ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు. అయితే మరణించిన విద్యార్ధుల తల్లిదండ్రులకు ఎలా న్యాయం చేస్తారన్న విషయం మాత్రం ఇప్పటికీ ఇంటర్ బోర్డు అధికారులు కానీ, ప్రభుత్వం కానీ వెల్లడించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles