41 dead in fiery Moscow plane crash-landing సాంకేతిక లోపంతో కుప్పకూలిన విమానం..41 మంది దుర్మణం..

41 dead as russian plane bursts into flames on landing

Sheremetyevo Airport, airplane emergency landing, flight emergency landing, russian passenger plane fire, russia plane fire, russia plane crash, aeroflot passenger plane fire, plane catches fire, russian plane fire dead, russian plane fire death toll

Forty-one people including at least two children have died after a Russian passenger plane made an emergency landing and erupted in a huge ball of fire and black smoke at Moscow’s busiest airport on Sunday, investigators said.

సాంకేతిక లోపంతో కుప్పకూలిన విమానం..41 మంది దుర్మణం..

Posted: 05/06/2019 01:03 PM IST
41 dead as russian plane bursts into flames on landing

రష్యాలోని మాస్కోలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 41 మంది మృతి చెందారు. టేకాఫ్ అయిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పైలెట్ ప్రయత్నిస్తుండగానే అది అక్కడికక్కడే కుప్పకూలింది. దీంతో ఒక్కఉదుటున మంటలు వ్యాపించడంతో.. విమానంలోని సుమారు 41 మంది ప్రయాణికులు మంటల్లో సజీవదహనమయ్యారు. ఆరుగురు గాయపడ్డారు. రష్యా రాజధాని మాస్కోలోని షేరెమెట్యావో విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది.

రష్యాకు చెందిన ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం  విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే  విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయని రష్యా దర్యాప్తు కమిటీ అధికార ప్రతినిధి ఎలినా మార్కోవక్యాయా తెలిపారు.

కాగా ఈ ప్రమాదం సంభవించినప్పుడు విమానంలో మొత్తంగా 73 మంది ప్రయాణికులు వున్నారని, వీరితో పాటు ఐదుగురు విమాన సిబ్బంది వున్నారని అమె వెల్లడించారు. వీరిలో 41 మంది సజీవ దహనమయ్యారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వీరిలో ఆరుగురు గాయపడ్డారని అధికారులు వివరించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ఒక విమాన సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sheremetyevo Airport  airplane emergency landing  flight emergency landing  russia  

Other Articles