Naga Babu Comments on YCP MP Vijayasai Reddy విజయసాయిరెడ్డిపై నాగబాబు ఫైర్: ‘‘జేడీపై ట్వీట్ చేసే నైతికత ఉందా.?’’

Janasena leader naga babu comments on ycp mp vijayasai reddy

pawan kalyan, janasena, Pawan Kalyan Nagababu, Pawan Kalyan JD Laxminarayana, Naga Babu satires on vijayasai reddy, Nagababu Laxminarayana, Nagababu vijaya saireddy, laximinarayana vijaysaiReddy, vishaka parliamentary constituency, Nagababu, JD Laxminarayana, vijaysai reddy, twitter, andhra pradesh, politics

Actor turned politician Nagababu, who contested as MP from Narsapuram Constituency slams YCP MP Vijayasai Reddy. This Janasena Leader says has vijaya sai reddy has any ethics to make a tweet on CBI former JD VV Laxminarayana.

ITEMVIDEOS: విజయసాయిరెడ్డిపై నాగబాబు ఫైర్: ‘‘జేడీపై ట్వీట్ చేసే నైతికత ఉందా.?’’

Posted: 05/02/2019 03:42 PM IST
Janasena leader naga babu comments on ycp mp vijayasai reddy

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణపై ట్వీట్ చేసే నైతికత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లేదని జనసేన నేత, ఆ పార్టీ తరఫున నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాగబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, ఎన్నికల తరువాత ప్రతి వాళ్లూ... నాకెన్ని సీట్లు వస్తాయ్... నా సర్వేలో ఇంత వచ్చింది, నీ సర్వేలో ఇంత వచ్చింది. అంటూ లెక్కలు వేసుకుంటున్నారని, ఇన్ని లెక్కలు అసలెందుకు? అని నాగబాబు ప్రశ్నించారు.

ఈవీఎం మిషిన్లలో ఓటరు తీర్పు గత నెల 11నే నిక్షిప్తమైందని, ఇక ఓట్ల లెక్కింపుకు మరో 20 రోజులు మాత్రమే ఉందని, ఈ 20, 25 రోజులు ఆగలేరా? ఈలోపుగా ఆ సర్వే అంటాడు, ఈ సర్వే అంటాడు. ఎందుకోచ్చిన సర్వేలు.. అంచనాలు.. అన్నీ లెక్కింపు రోజునే తేలిపోతాయని ఆయన అన్నారు. ఓ వైపు చంద్రబాబు సమీక్షలు అంటుంటే మరోవైపు వైసీపీ మాత్రం సర్వేలంటోందని ఆయన రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలపై వ్యంగోక్తులు విసిరారు.

పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ఒక్కడే. రూములో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ మనశ్శాంతిగా ఉన్నారు. నాయుడుగారేమో సమావేశాల మీద సమావేశాలు, జగన్ గారేమో... ఆ విజయసాయిరెడ్డితోటి రకరకాల వింత ట్వీట్లు. విజయసాయిరెడ్డి నాకు ఒకప్పుడు ఫ్రెండ్. ఆయనకు జేడీ లక్ష్మీ నారాయణ మీద ట్వీట్ వేసేంత నైతికత ఉందా అసలు? ఊహించగలమా? ఆయనెక్కడ? విజయసాయిరెడ్డి ఎక్కడ? ఓ రెండు మూడు సార్లు చదివిన తరువాత... బాబూ నీతో దరిద్రం మాకొద్దు, పనులున్నాయని చెప్పి, వదిలించుకున్నా" అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles